కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌కు సొంతగడ్డపై నిమ్మగడ్డ చురకలు-వైఎస్సార్‌ను గుర్తుచేస్తూ- ఆశీస్సులున్నాయంటూనే

|
Google Oneindia TeluguNews

ఏపీలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జగన్ సర్కార్‌తో ముఖాముఖీ పోరు సాగిస్తున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ ఇవాళ జగన్ సొంతగడ్డలో పర్యటిస్తున్నారు. ఒంటిమిట్టలో రాముడి దర్శనం తర్వాత నిమ్మగడ్డ జగన్‌ను టార్గెట్‌ చేస్తూ చేసిన హాట్‌ కామెంట్స్‌ సంచలనంగా మారాయి. జగన్‌ను ఆయన తండ్రి వైఎస్సార్‌తో పోలుస్తూ నిమ్మగడ్డ చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వానికి, సీఎం జగన్‌కూ సూటిగా తాకేలా ఉన్నాయి. దీంతో నిమ్మగడ్డ వ్యాఖ్యలు ప్రభుత్వంలోనూ చర్చనీయాంశమవుతున్నాయి.

నిమ్మగడ్డ పదవీకాలం పొడిగింపు ? మరో రెండు నెలలు- కలిసొస్తున్న ఈక్వేషన్‌ ఇదే నిమ్మగడ్డ పదవీకాలం పొడిగింపు ? మరో రెండు నెలలు- కలిసొస్తున్న ఈక్వేషన్‌ ఇదే

జగన్‌ ఇలాకాలో నిమ్మగడ్డ పర్యటన

జగన్‌ ఇలాకాలో నిమ్మగడ్డ పర్యటన

పంచాయతీ ఎన్నికల కేంద్రంగా జగన్ సర్కార్ వర్సెస్‌ ఎస్ఈసీగా సాగుతున్న పోరు నేపథ్యంలో ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్ సీఎం జగన్‌ సొంత జిల్లా కడపలో పర్యటిస్తున్నారు. జగన్ సర్కారు తనను టార్గెట్‌ చేస్తున్న వేళ దానికి కౌంటర్ ఇచ్చేందుకేనా అన్నట్లు జిల్లాల్లో పర్యటిస్తూ ఎన్నికల వేళ హంగామా చేస్తున్న నిమ్మగడ్డ ఇవాళ కడపలో అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. అంతకంటే ముందే ఒంటిమిట్ట రామాలయానికి వెళ్లిన నిమ్మగడ్డ అనంతరం మీడియాతో మాట్లాడారు. ఒంటిమిట్టలో బసచేసి స్వామివారి అభిషేకంలో పాల్గొనాలనేది తన వ్యక్తిగత కోరిక అని, ఆ కోరిక నేరవెరడం అదృష్టంగా భావిస్తున్నట్లు నిమ్మగడ్డ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సీఎం జగన్‌తో పాటు వైసీపీ సర్కారును పూర్తిగా టార్గెట్‌ చేసేలా ఉన్నాయి.

వైఎస్సార్‌ హయాం గుర్తుచేసుకున్న నిమ్మగడ్డ

వైఎస్సార్‌ హయాం గుర్తుచేసుకున్న నిమ్మగడ్డ

కడపలో పర్యటిస్తున్న సందర్భంగా మాజీ సీఎం, జగన్‌ తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయంలో ఏం జరిగిందో నిమ్మగడ్డ గుర్తుచేసుకున్నారు. వైఎస్‌ హయాంలో తాను ఆర్ధికశాఖ కార్యదర్శిగా పనిచేశానని, రాజ్‌భవన్ ఆశీస్సులోనే ఎన్నికల కమిషనర్‌ అయ్యానని నిమ్మగడ్డ తెలిపారు. దివంగత వైఎస్‌లో లౌకిక దృక్పథం ఉండేదని, తనపై వైఎస్ ఉంచిన నమ్మకాన్ని ఎప్పుడూ ఒమ్ము చేయలేదని నిమ్మగడ్డ గుర్తుచేసుకున్నారు.

వైఎస్‌తో పోలుస్తూ జగన్‌కు చురకలు

వైఎస్‌తో పోలుస్తూ జగన్‌కు చురకలు


ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలకు తాను ప్రత్యక్ష సాక్షినని చెప్పిన నిమ్మగడ్డ.. భయపడే ప్రసక్తే లేదంటూ కడపలో స్పష్టంచేశారు. సరైన సమయంలో ఎన్నికల నిర్వహణ రాజ్యాంగ హక్కని, రాజ్యాంగం ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తున్నానన్నారు. వ్యవస్ధలను గౌరవించకుండా మా వాళ్లూ, మీ వాళ్లూ అనడం సరికాదంటూ జగన్‌ను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. వైఎస్‌ దగ్గర పనిచేయడం వల్లే తన జీవితంలో గొప్ప మలుపు వచ్చిందని నిమ్మగడ్డ తెలిపారు. తాను వైఎస్‌ దగ్గర ఫైనాన్స్‌ సెక్రటరీగా పనిచేశానని నిమ్మగడ్డ గుర్తుచేసుకున్నారు. తనకు వైఎస్సార్‌ ఆశీస్సులు ఉన్నాయన్నారు. వైఎస్‌కు రాజ్యాంగం పట్ల గొప్ప గౌరవభావం ఉండేదని, కీలక అంశాల్లో భావ ప్రకటనా స్వేచ్ఛ కల్పించారన్నారు. ఏ వ్యవస్ధనీ ఎప్పుడూ తప్పుపట్టలేదన్నారు. ఆయన దగ్గర పనిచేసినందుకు ఎప్పుడూ తాను ఇబ్బందిపడలేదన్నారు. తద్వారా జగన్‌ తనను ఇబ్బందిపెడుతున్నారని చెప్పకనే చెప్పారు.

ప్రైవేటు అజెండాలు సరికాదన్న నిమ్మగడ్డ

ప్రైవేటు అజెండాలు సరికాదన్న నిమ్మగడ్డ


పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాల తీరుపైనా నిమ్మగడ్డ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2006లో 36 శాతం ఏకగ్రీవం అయ్యాయని, ఆ తర్వాత తగ్గుముఖం పట్టాయన్నారు. బలవంతపు ఏకగ్రీవాలకు పాల్పడటం తగదన్నారు. ఏకగ్రీవాలకు ప్రభావితం చేసే వారిపై నేటి నుంచి షాడో టీమ్‌ల ఏర్పాటు చేస్తామన్నారు. వెనుకబడిన వారిని ప్రోత్సహించడమే సమన్యాయం అని నిమ్మగడ్డ తెలిపారు. ప్రతిపక్ష పార్టీలపై వేధింపులు ఉండబోవన్నారు. ఎన్నికల నిర్వహణపై జిల్లా యంత్రాంగాన్ని ఆయన అభినందించారు. పనితనం లేని వారిపై ఆరోపణళు రావడం సహజమని, పర్సనల్, ప్రైవేట్‌ అజెండాలు పెట్టుకోవడం సరికాదన్నారు. మీడియాను మించిన నిఘా మరొకటి లేదన్నారు. చురుకైన బాధ్యత మీడియా తీసుకోవడం అభినందనీయమన్నారు.

English summary
andhra pradesh sec nimmagadda ramesh kumar take a dig at cm jagan in his own soil kadapa with remembering his late father and former cm ysr.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X