పద్ధతులు మారాయి!: సచివాలయం సాక్షిగా బల్లపైనే అధికారికి లంచం

ఆంధ్రప్రదేశ్ సచివాలయం సాక్షిగా ఓ లంచాధికారి తన చేతివాటాన్ని ప్రదర్శించాడు. పట్టపగలు బల్లపైనే లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. సచివాలయంలోని కీలక విభాగంలో పని చేస్తున్న అధికారి తీరు ఇది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ సచివాలయం సాక్షిగా ఓ లంచాధికారి తన చేతివాటాన్ని ప్రదర్శించాడు. పట్టపగలు బల్లపైనే లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. సచివాలయంలోని కీలక విభాగంలో పని చేస్తున్న అధికారి తీరు ఇది.

అసిస్టెంట్‌ సెక్రటరీ స్థాయి అధికారి లంచం తీసుకుంటుండగా తీసిన ఫొటో ఇప్పుడు మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ సంచలనంగా మారింది. ఫైలును కింది నుంచి పైకి ఫార్వర్డ్‌ చేయడం ఆయన పనే అయినా.. లంచం తీసుకోకుండా అలా జరగదట.

 Andhra Pradesh Secretariat officer caught on camera when taking bribe.

శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ఇద్దరు మహిళలు వచ్చి ఆయన ముందు కూర్చున్నారు. వారిలో ఒక మహిళ తన పర్సులోంచి కొన్ని 2వేలు, ఐదొందల నోట్లు తీశారు. మొత్తం ఐదారువేల రూపాయలకు పైగానే ఉంటాయి.

ఆయన గురించి తెలుసో ఏమో గానీ.. ఏమాత్రం ఆలోచించకుండా డబ్బును సదరు అధికారి టేబుల్‌పై పెట్టారు. ఆ డబ్బు టేబుల్ పై ఉండగానే వారికి సంబంధించిన ఫైలును కంప్యూటర్‌లో ఫార్వర్డ్‌ చేశాడట. ఆ తర్వాత వారిచ్చిన నోట్ల కట్టలు జేబులో పెట్టుకోవడంతో అతని పని ముగిసింది. సచివాలయంలోనే ఇలా ఉంటే.. రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు ఏ రీతిన లంచాలు వసూలు చేస్తున్నారో అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కసాయి తల్లి దారుణం: కుక్కలు పీక్కుతున్న మృత శిశువు మృతదేహం

కర్నూలు:నంద్యాలలో దారుణం చోటుచేసుకుంది. మృత శిశువును కుక్కలు పీక్కుతున్న విషయం శనివారం ఉదయం వెలుగుచూసింది. ఆడ పిల్ల అని పడేయడంతో శిశువు మృతిచెందగా కుక్కలు పీక్కుతిన్నాయి.

హృదయ విదారకంగా ఉన్న ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి..
నంద్యాల ప్రభుత్వాసుపత్రి వెనుకాల మృత ఆడశిశువును స్థానికులు శనివారం ఉదయం గుర్తించారు. అయితే... అప్పటికే కుక్కలు పీక్కుతినడంతో చెల్లాచెదురుగా శరీర భాగాలన్నీ అక్కడా ఇక్కడా పడిపోయాయి. కాగా, ఎవరో గుర్తుతెలియని మహిళ ఆడపిల్ల అనో, లేక పెళ్లి కాకుండా తల్లి కావడం వల్లోగాని ఆసుపత్రి వెనుక భాగంలో పడేసినట్లుగా తెలుస్తోంది. ఆడపిల్లల సంరక్షణకు ప్రభుత్వాలు ఎన్ని ప్రచారాలు నిర్వహిస్తున్నా ప్రతిరోజూ ఎక్కడో ఓచోట ఆడపిల్లలను విసిరేస్తున్న దృశ్యాలు కళ్లముందు కనిపిస్తూనే ఉండటం శోచనీయం.

మద్యం దుకాణం వద్ద ఘర్షణ: వ్యక్తి దారుణ హత్య

నెల్లూరు: కావలి రూరల్ మండలం కోతపల్లిలో దారుణ హత్య జరిగింది. శనివారం ఉదయం మద్యం దుకాణం దగ్గర జరిగిన తగాదా నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కేశవులు(35) అనే వ్యక్తిని శ్రీనివాసులు అనే వ్యక్తి కిరాతకంగా హత్య చేశాడు.

కేశవులు తన ఇంటి ప్రాంగణంలో నిద్రిస్తుండగా అక్కడకు వెళ్లిన శ్రీనివాసులు కత్తితో కేశవులపై దాడికి దిగి అక్కడి నుంచి పరారయ్యాడు. కాగా, కోన ఊపిరితో కేశవులు కొట్టుకుంటున్న దృశ్యాన్ని చూసిన స్థానికులు చలించిపోయారు. 108 కి సమాచారం ఇచ్చినా వారు అందుబాటులోకి రాలేదని స్థానికులు అరోపిస్తున్నారు.

ఎర్ర చందనం హైజాక్ టీమ్ అరెస్ట్: నాటు తుపాకులు, నల్లమందు సీజ్

చంద్రగిరి అటవీప్రాంతం ఐైతేపల్లిలో రెడ్ శ్యాండుల్ హైజాక్ టీంని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి నాటు తుపాకులు, నల్లమందు, 13 ఎర్రచందనం దుంగలు సీజ్ చేశారు. 12 మంది కూలీలు పరారీ లో ఉన్నారు.

చంద్రగిరి నియోజక వర్గం ఐతేపల్లి అటీప్రంతంలో ఇద్దరు హైజాక్ యర్రచందనం స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ అధికారులు అరెస్ట్ చేశారు. వారివద్ద నుంచి ఒక నాటుతుపాకీ, నల్లమందు, 13 ఎర్రచందనం దుంగలను అధికారులు సీజ్ చేశారు. పట్టుబడ్డ ఇద్దరూ ఐతేపల్లికి చెందిన తండ్రీకొడుకులు శేఖర్, మునిక్రిష్ణలు. వీరు ఇద్దరూ తరచురెడ్ శ్యాండిల్ డంప్ లను గుర్తించి అక్కడ కాపలావున్న కూలీలను నాటుతుపాకీతో బెదిరించి దుంగలను హైజాక్ చేస్తారు. అనంతరం వాటిని తమిళనాడుకు సరఫరా చేస్తారు. ఈ నేపధ్యంలో టాస్క్ ఫొర్స్ అధికారులు ఐతేపల్లి అటవీప్రంతంలో కూంబింగ్ నిర్వహించగా హైజాకర్లను గుర్తంచారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+