AP SIR: ఏపీలో 'సర్' పై ఈసీ కీలక నిర్ణయం..! రంగంలోకి 28 ఐఏఎస్ లు..!

ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ (AP SIR)పై రాజకీయ పార్టీల్లో అప్పుడే అలజడి మొదలైంది. ముఖ్యంగా ప్రత్యర్థి రాజకీయ పార్టీలు బీఎల్వోలతో కుమ్మక్కై తమ ఓట్లను తొలగిస్తుున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే రాయలసీమలో టీడీపీ నేతల కన్నుసన్నల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగడంపై వైఎస్సార్సీపీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.

SIR తో బూత్ కు 50 ఓట్ల తొలగింపు? నేతలకు జగన్ బిగ్ అలర్ట్..!
SIR తో బూత్ కు 50 ఓట్ల తొలగింపు? నేతలకు జగన్ బిగ్ అలర్ట్..!

రాష్ట్రంలో జరుగుతున్న ఓటర్ల జాబితాల సవరణ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం 28 మంది ఐఏఎస్‌ అధికారులను పరిశీలకులుగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ పరిశీలకులు ఎన్నికల నమోదు అధికారులుగా ఉన్న ఈఆర్వోల పనితీరును పరిశీలిస్తూ, లోపాల్ని సరిదిద్దేందుకు తగిన సూచనలు, సలహాలు అందించబోతున్నారు.

AP SIR Election Commission Names 28 Observers for Special Intensive Revision
SIR: బీఎల్వోల కోసం ఎదురుచూడొద్దు..! ఏపీ ఓటర్లకు ఈసీ కీలక సూచన..!
SIR: బీఎల్వోల కోసం ఎదురుచూడొద్దు..! ఏపీ ఓటర్లకు ఈసీ కీలక సూచన..!

అలాగే ఈసీ మార్గదర్శకాల ప్రకారం ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ సక్రమంగా సాగుతుందో లేదో పరిశీలకులు నిరంతరం పర్యవేక్షించాల్సి ఉంటుంది. వీరు ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, అభ్యంతరాల పరిష్కారంలో జిల్లా ఎన్నికల అధికారులతో సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి పరిశీలకుడు తనకు కేటాయించిన జిల్లాను ప్రత్యేక సవరణ కాలంలో కనీసం మూడు సార్లు సందర్శించాలని సీఈవో ఆదేశించారు. క్లెయిములు, అభ్యంతరాల స్వీకరణ దశలో మొదటి పర్యటన, వాటి పరిష్కార దశలో రెండో పర్యటన , బీఎల్‌వోలు వర్కింగ్‌ కాపీల పరిశీలన, అనుబంధ జాబితాల ప్రచురణ సమయంలో మూడో పర్యటన చేయాల్సి ఉంటుంది. దీంతో వీరి బాధ్యత ముగియనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+