AP Rains: ఏపీలో మరో 3 రోజులపాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు, మునిగిపోతున్న పంటలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే కురుస్తున్న వర్షాలతో పలు ప్రాంతాల్లో పంటలు నీటమునగడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అల్పపీడనం కారణంగా మరో మూడు రోజులపాటు సాధారణం నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతుండటంతో మరింత ఆందోళనకకర పరిస్థితులు నెలకొన్నాయి.

ఏపీలో మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు
తాజా, అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో రాగల మూడు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు, భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కొమరిన్, దాని పరిసర ప్రాంతాల మీద ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం లక్ష్యద్వీపం, దాన్ని ఆనుకొని ఉన్న ఆగ్నేయ అరేబియా సముద్రం మీద ఉంది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతోంది. ఈ అల్పపీడనం ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణించి రాగల మూడు నాలుగు రోజుల్లో మరింత బలపడు తుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

ఉరుములుమెరుపులతో కూడిన భారీ వర్షాలు
మరో ఉపరితల ద్రోణి కొమరిన్ ఉత్తర శ్రీలంక పరిసర ప్రాంతాల మీద నుంచి పశ్చిమ మధ్య బంగాళా ఖాతం, దక్షిణ కోస్తా ఆంధ్ర తీరం వరకు మన్నార్ గల్ఫ్ తమిళనాడు తీర ప్రాంతం మీదుగా వ్యాపించి ఉంది. దీని కారణంగా బుధవారం నుంచి మరో మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పలు సూచనలు చేసింది.
ఉత్తర కోస్తాంధ్రాలో బుధవరాం ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకటి లేదా రెండు చోట్ల భారీ నుండి అతి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గురువారం ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శుక్రవారం ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరుతోపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

కోస్తా, రాయలసీమలోనూ వర్షాలు..
దక్షిణ కోస్తాంధ్రాలో బుధవారం ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గురువారం దక్షిణ కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. ఒకటి లేక రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శుక్రవారం ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది. రాయలసీమలోనూ బుధవారం నుంచి మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. నైరుతి రుతుపవనాలు వెళ్లిపోయినప్పటికీ.. తరచూ ఏర్పడుతున్న అల్పపీడనాల కారణంగా ఏపీలో గత కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి.












Click it and Unblock the Notifications