AP weather: ఏపీలో మరో మూడు రోజులపాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు, అల్పపీడనం

అమరావతి: అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరికొద్ది రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతం, దాని దగ్గరగా ఉండే తమిళనాడు తీరానికి దగ్గరగా శ్రీలంక ప్రాంతంలో ప్రస్తుతం అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

ఈ అల్పపీడనంనకు అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతుందని వివరించింది. రానున్న 3-4 రోజులలో ఈ అల్పపీడనం పశ్చిమ దిశలో నెమ్మదిగా ప్రయాణించే అవకాశం ఉందని తెలిపింది. ఈ అల్పపీడనంనకు అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి ఉత్తర కోస్తాంధ్ర వరకు కొనసాగుతున్న ఉపరితల ద్రోణి శనివారం బలహీనపడిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

 AP weather update: three more days Normal to heavy rains in few district in andhra pradesh

అల్పపీడనం, ఉపరితల ద్రోణి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. శని, ఆదివారాల్లో ఉత్తర కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. సోమవారం ఉత్తర కోస్తాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది, భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తాంధ్రాలో శని, ఆదివారాల్లో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి దక్షిణ కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

ఇక రాయలసీమలోనూ శనివారం నుంచి మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. గత రెండు మూడు రోజల నుంచి ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+