బ్లాక్‌చైన్ క్యాపిటల్‌గా ఏపీ, టార్గెట్ వేల ఉద్యోగాలు: లోకేష్, ‘ఆధార్ ఉంటే చాలు’
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని ఐటీ మంత్రి నారా లోకేష్ అన్నారు. రాష్ట్రాన్ని బ్లాక్ చైన్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్‌గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని అన్నారు. శుక్రవారం కోవలెంట్ ఫండ్ ప్రతినిధులను సచివాలయంలో ఏర్పాటు చేసిన రియల్ టైం గవర్నెన్స్ సెంటర్‌కు తీసుకొని వెళ్లిన లోకేష్.. రాష్ట్రంలో అమలు చేస్తున్న రియల్ టైం గవర్నెన్స్ గురించి వివరించారు.
కాగా, బ్లాక్ చైన్ టెక్నలజీ అభివృద్దికి లోకేశ్ సమక్షంలో ఆంధ్రప్రదేశ్ ఐటి శాఖ, కోవలెంట్ ఫండ్ మధ్య శుక్రవారం ఒప్పందం కుదిరింది. విశాఖపట్నం లో బ్లాక్ చైన్ టెక్నాలజీ బిజినెస్ కాన్ఫరెన్స్ నిర్వహించామని, బ్లాక్ చైన్ టెక్నాలజీ లో రాష్ట్ర యువతి యువకులు ఉద్యోగాలు సాధించేందుకు హ్యాకథాన్స్ నిర్వహిస్తున్నామన్నారు.

ఉద్యోగాల కల్పనే టార్గెట్
స్టార్ట్ అప్ కంపెనీలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించిందన్నారు. బ్లాక్ చైన్ టార్గెట్ 2019లో భాగంగా బ్లాక్ చైన్ టెక్నాలజీ యూనివర్సిటీ ఏర్పాటుకు కోవలెంట్ ఫండ్ తో ఒప్పందం ఎంతగానో ఉపయోగపడుతుందని లోకేష్ చెప్పారు. 2019 లోపు 5000 మంది విద్యార్థులకు బ్లాక్ చైన్ టెక్నాలజీ లో ఉద్యోగాలు కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్ చైన్ టెక్నాలజీ అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర యువతి యువకులకు కోవలెంట్ ఫండ్ ద్వారా శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు అందిపుచ్చుకునేలా చెయ్యడమే ఈ ఒప్పందం లక్ష్యమని మంత్రి నారా లోకేష్ వివరించారు.
Recommended Video


విభజనతో అనేక సమస్యలు
రాష్ట్ర విభజన తరువాత అనేక సమస్యలు ఎదుర్కొన్నామని సమస్యలు అధిగమించి, ప్రజలకు మెరుగైన సేవలు, సంక్షేమ కార్యక్రమాలు అందించడానికి రాష్ట్రంలో టెక్నాలజీని పెద్ద ఎత్తున వినియోగిస్తున్నామని నారా లోకేష్ తెలిపారు. రియల్ టైం గవర్నెన్స్ ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకొని తక్షణమే పరిష్కరిస్తున్నామన్నారు. సీఎం కోర్ డ్యాష్ బోర్డ్ ద్వారా రాష్ట్రంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల అమలు గురించి తెలుసుకుంటున్నామని మంత్రి తెలిపారు.

అందుకే బ్లాక్ చైన్ టెక్నాలజీ..
ప్రభుత్వంలోని అన్ని శాఖలను అనుసంధానం చేస్తూ ఒకే చోట సమాచారం అంతా ఉండేలా ఈ ప్రగతి కోర్ ప్లాట్ ఫార్మ్ రూపొందించినట్లు తెలిపారు. ఏపీ ఫైబర్ నెట్ ద్వారా 149 రూపాయిలకే టెలివిజన్, వైఫై, టెలిఫోన్ సేవలు అందిస్తున్నామని తెలిపారు. టెక్నాలజీని పెద్ద ఎత్తున వినియోగిస్తున్నామని దీని వలన సైబర్ ఎటాక్స్ జరిగే ప్రమాదం కూడా ఉందని అందుకే బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా ప్రభుత్వ సమాచారానికి రక్షణ కల్పిస్తున్నామని మంత్రి లోకేష్ వివరించారు.

ఆధార్ ఉంటే చాలు..
రాజధాని ప్రాంతంలో ల్యాండ్ రికార్డ్స్ టాంపరింగ్ జరగకుండా బ్లాక్ చైన్ టెక్నాలజీ వినియోగిస్తున్నామని మంత్రి లోకేష్ అన్నారు. సర్టిఫికెట్లు కోసం ప్రభుత్వం చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా డిజిటల్ లాకర్ , ఆధార్ నెంబర్ ద్వారా అన్ని సర్టిఫికెట్లు ఆన్‌లైన్‌లో ఇచ్చే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు లోకేష్ తెలిపారు.

2.5లక్షల ఇళ్లు ప్రారంభం
ఫిబ్రవరి మొదటివారంలో 2.5 లక్షల ఇళ్లను ప్రారంభించడానికి సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సంక్రాంతి సమయంలో ముహూర్తం సరిగా లేనందున, ఫిబ్రవరి మొదటి వారంలో సామూహిక గృహ ప్రవేశాలు చేద్దామని అన్నారు. అక్టోబర్‌లో మరో విడత గృహ ప్రవేశాలు నిర్వహిస్తామని స్పష్టం చేసారు. 18 లక్షల ఇళ్ళను 2019 జనవరికి పూర్తి చేయాలని గృహ నిర్మాణ శాఖను ఆదేశించారు. కేంద్రం నుంచి మరిన్ని ఇళ్లను సాధించాల్సి ఉందన్నారు. రాజకీయంగాను పార్లమెంటులో ప్రస్తావించి సాధించుకోవాలన్నారు. ఎన్టీఆర్ గ్రామీణ గృహనిర్మాణం కింద 2017-18లో మంజూరు చేసిన ఇళ్ల సంఖ్య రెండు లక్షలు కాగా.. ఇప్పటివరకు 1,88,559 (94%) ఇళ్లు పూర్తయ్యాయని తెలిపారు. అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సు రెండోరోజు గృహ నిర్మాణ శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.












Click it and Unblock the Notifications