తుఫాను ప్రభావం, బిగ్ అలర్ట్ - ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..!!
ఏపీని వర్షాలు వీడటం లేదు. వరుస అల్ప పీడనాలు ఏర్పడుతుండటంతో కోస్తా జిల్లాల కు వర్ష ముప్పు తొలగటం లేదు. తాజాగా నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ప్రస్తుతం ఇది ఉత్తర దిశగా ప్రయాణిస్తోంది. ఈ ప్రభావంతో రానున్న 48 గంటల్లో భారీ వర్షాలతో పాటుగా గంటకు 35-45 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ఈ జిల్లాలపై ప్రభావం
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా రూపాంతంరం చెంది కోస్తా తీరం వైపు దూసుకు వస్తోంది. రాబోయే 24 గంటల్లో వాయవ్యదిశగా పయనిస్తూ ఉత్తర తమిళనాడు, దక్షిణకోస్తా తీరాల వైపు మళ్లుతుంది. తర్వాత కోస్తా తరం వెంబడి కదులుతుంది. దీని ప్రభావంతో శుక్రవారం వరకు ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ తెలిపింది. గురువారం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అదే విధంగా శ్రీకాకుళం, అల్లూరి సీతారామారాజు, డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

భారీ వర్షాలతో
గురువారం నుంచి మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విశాఖ వాతావరణశాఖ హెచ్చరించింది. ఇక,
శుక్రవారం పార్వతీపురం, శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కరుస్తాయని పేర్కొంది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు.సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో ఆదివారం వరకు మత్స్య కారులు వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. అల్పపీడనం ప్రభావంతో ఉప్పాడ సముద్ర తీరప్రాంతం ఇప్పటికే అల్లకల్లోలంగా మారింది. కెరటాల ఉద్ఢృతికి కోనపాపేటలో 15 ఇళ్ళు నేలమట్టం అయ్యాయి.
తుఫానుగా బలపడి
ఈ అల్పపీడనం తుపానుగా బలపడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తా యని అంచనా వేస్తున్నారు. కొత్తపల్లి మండలంలో తీర ప్రాంతాలైన ఉప్పాడ, అమీనాబాద్ కోనపాపపేట గ్రామాల్లో కోతకు ఇల్లు కోతకు గురవుతున్నాయి. తుఫాన్ ప్రభావంతో సముద్ర అలల తాకిడికి ఏటా తీరప్రాంతానికి ఆనుకుని ఉన్న గృహాలు నేలమట్టం అవుతూనే ఉంటాయి. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తుండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు. ఈ నెలాఖరున అండమాన్ సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications