ఏపీఎస్ఆర్టీసీలో సమ్మె సైరన్ : 9న ఆర్టీసీ ఎండీ, కమిషనర్‌కు జేఏసీ నోటీసు

అమరావతి : ఏపీఎస్ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగనుంది. ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇవ్వాలని కార్మిక సంఘాల జేఏసీ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 9న ఆర్టీసీ ఎండీ, కార్మికశాఖ కమిషనర్ కు నోటీసు ఇస్తామని ఈయూ సహా 8 కార్మిక సంఘాలు ప్రకటించాయి.

apsrtc jac go to strike : 9th gave notice to rtc md

చర్చలు విఫలం ..
వివిధ అంశాలపై ఫిబ్రవరి 5న మంత్రి అచ్చెన్నాయుడు కార్మిక సంఘం నేతలు చర్చలు జరిపారు. ఇచ్చిన హామీ మేరకు వేతన సవరణ బకాయి నిధులు చెల్లించాలని కోరారు. అయితే ఇప్పటివరకు తమ డిమాండ్ పై ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో సమ్మె చేపట్టాలని కార్మిక సంఘాలు డిసిషన్ తీసుకున్నాయి.

నెరవేర్చని డిమాండ్లు ..
వీటితోపాటు ఆర్టీసీలో అద్దె బస్సుల పెంపును విరమించుకోవాలని కూడా జేఏసీ ప్రభుత్వాన్ని కోరింది. ఈ డిమాండ్ పై కూడా సర్కార్ నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. సిబ్బందిని తగ్గిస్తూ యాజమాన్యం తీసుకున్న నిర్ణయాలను కూడా జేఏసీ తప్పుపట్టింది. ఈ చర్యలను వెంటనే నిలిపివేయాని జేఏసీ అల్టిమేటం జారీచేసింది. అయినా ప్రభుత్వం వెనక్కి తగ్గకపోవడంతో .. ఇక తాము సమ్మె చేపట్టాలని నిర్ణయం తీసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+