ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ సంక్రాంతి కానుక
APSRTC: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. సరికొత్త గమ్యస్థానాలకు ప్రత్యేక బస్సులను నడిపిస్తోంది. పొరుగు రాష్ట్రాల్లో ఉన్నప్రఖ్యాత పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలకు ప్రత్యేక ప్యాకేజీలతో కూడిన స్పెషల్ సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తోంది.
ప్రయాణికులను ఆకట్టుకునే క్రమంలో స్టార్ లైనర్, నైట్ రైడర్, ఇంద్ర, డాల్ఫిన్, వెన్నెల బస్ సర్వీసులను నడిపిస్తోంది ఏపీఎస్ఆర్టీసీ. ఆయా బస్ సర్వీసులన్నింటికీ మంచి డిమాండ్ ఉంటోంది. ప్రయాణికుల నుంచి లభిస్తోన్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని వాటి సర్వీసుల సంఖ్యను ఎప్పటికప్పుడు పెంచుకుంటూ పోతోంది.

విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కడప.. వంటి జిల్లా కేంద్రాల నుంచే కాకుండా ఇతర పట్టణాల నుంచీ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు స్టార్ లైనర్, నైట్ రైడర్ బస్సులను ప్రవేశపెట్టింది. ప్రయాణికులను ఆకట్టుకునే క్రమంలో మరిన్ని కీలక నిర్ణయాలను తీసుకుంటోంది ఏపీఎస్ఆర్టీసీ.
సంక్రాంతి పండగ సీజన్‌లో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడానికి ఇప్పటికే ప్రత్యేక బస్సులను నడిపించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. మంగళవారం నాడే ఆయా బస్సులన్నీ కూడా రోడ్డెక్కాయి. సంక్రాంతి పండగ రద్దీని తట్టుకోవడానికి అవసరమైతే ప్రత్యేక బస్సుల సంఖ్యనూ పెంచడానికీ రంగం సిద్ధం చేసింది.
సంక్రాంతి పండగ సీజన్‌లో టికెట్ల కొనుగోలుపై 10 శాతం రాయితీని ప్రకటించింది ఏపీఎస్ఆర్టీసీ. సంస్థ బస్సుల్లో రాను పోను టిక్కెట్లను ఒకేసారి బుక్ చేసుకున్న ప్రయాణికులకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. తాము ఎక్కదలిచిన బస్ స్టేషన్ నుంచి గమ్యస్థానానికి, గమ్యస్థానం నుంచి మళ్లీ తమ సొంత స్థలాలకు ఒకేసారి రిటర్న్ టికెట్ బుక్ చేసుకున్న వారికి ఈ 10 శాతం రాయితీ ఇస్తోంది.
రానుపోను టికెట్లను బుక్ చేసుకున్న వారికి ఇన్‌స్టంట్‌గా 10 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు. అన్ని రకాల బస్సుల్లోనూ ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. రిజర్వేషన్ సౌకర్యం ఉన్న డీలక్స్, సూపర్ లగ్జరీ, స్టార్ లైనర్, ఇంద్ర, నైట్ రైడర్, ఏసీ- స్లీపర్, నాన్ ఏసీ- స్లీపర్ బస్సుల్లో కూడా టికెట్‌పై 10 శాతం రాయితీ లభిస్తుంది.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications