తిరుమలకు మరిన్ని ఆర్టీసీ బస్సులు- టూ వీలర్లు రద్దు
Tirumala Srivari Brahmotsavalu 2024: కలియుగ వైకుంఠంలా అలరారుతున్న తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. రెండో రోజైన శనివారం ఉదయం శ్రీమలయప్ప స్వామివారు మురళీ కృష్ణుడి అవతారంలో అశేష భక్తులకు దర్శనం ఇచ్చారు.
ఏనుగులు, అశ్వాలు, భక్తుల కోలాటాలు, మంగళ వాయిద్యాలు, ఇతర కళా ప్రదర్శనల మధ్య మలయప్ప స్వామివారు- అయిదు తలల చిన్నశేష వాహనంపై ఊరేగారు. లక్షలాదిమంది భక్తులను కటాక్షించారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని గోవిందుడి నామస్మరణతో శేషాచలం కొండలు మారుమోగిపోతోన్నాయి.

చిన్నశేషుడిని వాసుకిగా కొలుస్తారు భక్తులు. శ్రీవైష్ణవ సంప్రదాయం ప్రకారం శ్రీమన్నారాయణుడిని శేషిగా, ఈ సమస్త భూ ప్రపంచాన్ని శేషభూతంగా పూజిస్తారు. ఈ శేషిభావానికి సూచికగా శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మలయప్ప స్వామివారిని చిన్న శేషవాహనంపై ఊరేగించడం ఆనవాయితీగా వస్తోంది.
చిన్నశేష వాహనాన్ని సందర్శిస్తే కుటుంబ శ్రేయస్సుతోపాటు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. కాగా- బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ సాయంత్రం 7 నుంచి 9 గంటల వరకు మలయప్ప స్వామివారు హంస వాహనంపై ఊరేగనున్నారు. భక్తులను కటాక్షించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.
కాగా- బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలకు వెళ్లే భక్తుల కోసం ఏపీఎస్ఆర్టీసీ అదనపు బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. తిరుపతి నుంచి తిరుమలకు ప్రతి రోజూ 404 బస్సులను నడిపిస్తోంది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారికి అవసరమైన గైడెన్స్ ఇవ్వడానికి డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్లు, డిపో మేనేజర్ హోదా గల 32 మంది అధికారులను నియమించింది.
తిరుపతి, తిరుమల బస్టాండ్‌లల్లో రౌండ్ ద క్లాక్ తరహాలో వాళ్లందరూ ఆయా బస్సుల రాకపోకలను పర్యవేక్షిస్తారు. అలాగే 200 మంది డ్రైవర్లు, 180 మంది కండక్టర్లు, 115 మంది సెక్యూరిటీ సిబ్బందిని నియమించింది. బస్సులు బ్రేక్ డౌన్ అయితే వెంటనే వాటిని రిపేర్ చేయడానికి మెకానిక్‌లను అందుబాటులో ఉంచింది.
బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేకంగా భావించే గరుడ సేవ కోసం కూడా టీటీడీ అధికారుల సమన్వయంతో ముందు జాగ్రత్త చర్యలను తీసుకోనున్నారు ఆర్టీసీ సిబ్బంది. గరుడసేవ రోజైన అక్టోబరు 8వ తేదీన రెండు ఘాట్ రోడ్‌లలో కూడా ద్విచక్ర వాహనాల రాకపోకలను నిషేధించింది టీటీడీ.
అక్టోబర్ 7వ తేదీన రాత్రి 9 గంటల నుంచి 9వ తేదీ ఉదయం తెల్లవారు జామున 6 గంటల వరకు ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలు రాకపోకలు సాగించడానికి అనుమతించరు. ఈ నేపథ్యంలో గరుడ సేవ నాడు భక్తుల రద్దీ మరింత అధికంగా ఉండే అవకాశం ఉన్నందున బస్సుల సంఖ్యను పెంచవచ్చు.
-
ఆ విషయంలో ఎవరిమాట వినొద్దు అని కలెక్టర్ లకు సీఎం చంద్రబాబు ఆదేశం! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్..












Click it and Unblock the Notifications