చంద్రబాబు మానస పుత్రికకు పెద్ద కష్టమే!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అరకు కాఫీ రైతులకు పెద్ద కష్టం వచ్చింది. ప్రస్తుతం ఏపీలోని ఏజెన్సీలో సాగవుతున్న కాఫీ తోటలలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రఖ్యాతిగాంచిన అరకు వ్యాలీ లోని కాఫీ తోటలలో బెర్రీ బోరర్ అనే పురుగు పట్టింది. ఈ పురుగు కాఫీ తోటలను నాశనం చేస్తుందని రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం కాఫీ రైతులకు అండగా రంగంలోకి దిగింది.
కాఫీ తోటలను పరిశీలించిన మంత్రి గుమ్మడి సంధ్యా రాణి
అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వ్యాలీ మండలం చినలబుడు, పకనకుడి గ్రామాల్లో కాఫీ తోటలలో రాష్ట్ర గిరిజన సంక్షేమ మహిళా సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పర్యటించారు. కాఫీ బెర్రీ బోరర్ పురుగు పట్టిన తోటలను జిల్లా కలెక్టర్ ఎ.ఎస్.దినేష్ కుమార్ తో కలసి సందర్శించి రైతులతో మాట్లాడారు. ప్రస్తుతం కాఫీ తోటలకు పురుగు పట్టిందని దాని నుండి పంటను మాములు స్థితికి తీసుకురావడానికి కృషి చేస్తున్నామని తెలిపారు.

ఆ పంట నాశనం చేస్తున్న పురుగు నివారణకు కమిటీ
సుమారు 80ఎకరాల మేరకు వ్యాపించిందని, దీనిపై కమిటీ వేయడం జరిగిందన్నారు. ఎక్కడైతే ఈ పురుగు ఉత్పన్నామౌతుందో అక్కడ మళ్ళీ పురుగు వ్యాపించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వెల్లడించారు. అరకు కాఫీ ముఖ్యమంత్రి మానస పుత్రికలా చూస్తున్నారని, శాసన సభ ప్రాంగణంలో, పార్లమెంట్ ప్రాంగణంలో కూడా అరకు కాఫీని ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. అరకు కాఫీ పంట అంతర్జాతీయ స్థాయిలో ఆదరణ పొందిందని అన్నారు.
ఎకరానికి రైతులకు 20 వేలు సాయం
కాఫీ రైతులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని, పూడ్చిపెట్టే ఖర్చు మరియు ఇతర ప్రయోజనాల కోసం ఎకరానికి రూ.5,000/- అందజేయడంతో పాటు కెజి కాఫీ కి రూ.50/- నష్టపరిహారం అందజేయడం జరుగుతుందని గిరిజన సంక్షేమ, మహిళా శిశు సంక్షేమ శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. పురుగు పట్టిన కాఫీ పంటకు రైతులు నష్టపోకూడదని కేజీకి రూ:50, ఎకరానికి రూ:20 వేలు ప్రభుత్వం అందిస్తోందని అన్నారు.
నష్ట పరిహారం సరిపోకుంటే పెంచే విషయం ఆలోచిస్తాం
అలాగే సుమారు లక్ష మొక్కలను కూడా రైతులకు ఉచితంగా అందించడం జరిగిందన్నారు. విత్తనాలు కూడా ఉచితంగా రైతులకు ఇస్తామని మంత్రి అన్నారు. రాబోయే మూడు సంవత్సరాలు కాఫీ పంటపై దృష్టి పెడతామన్నారు. గిరిజనులు, రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి తెలిపారు. ప్రతీ విషయం రైతులతో చర్చిస్తామని, వారికి ఇచ్చే నష్టపరిహారం సరిపోకపోతే పెంచి ఇచ్చే విషయంలో ఆలోచిస్తామని అన్నారు.
అరకు కాఫీ బ్రాండ్ కాపాడుకుంటామని చెప్పిన మంత్రి
రైతుల పంట భీమాపై ముఖ్యమంత్రితో సంప్రదిస్తామని మంత్రి అన్నారు. ఎట్టిపరిస్థితులలోనూ అరకు కాఫీ బ్రాండ్ కాపాడుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. పురుగు సోకిన తోటలో కాఫీ మొత్తం పంట, కాయలను వెంటనే కొయ్యాలి అని, కాఫీ పంటను కోసేటప్పుడు టార్పలిస్ షీట్ ను పరిచి పంటను కొయ్యాలి అని పేర్కొన్నారు.
పంటను మూడడుగుల లోతు గోతిలో పాతిపెట్టాలి
నేల రాలిన కాఫీ కాయలను కూడా పూర్తిగా సేకరించాలని, పురుగు సొకిన చోటలో అన్నీ కాయలను కోసి వేడినీటిలో 2-3 నిమిషాలు ఉంచాలి. ఆ తరువాత 3 అడుగుల గోతి తీసి, కోసిన కాయలను మట్టిలో పాతిపెట్టాలన్నారు. ఈ పురుగు మొత్తం పంటను నాశనం చేసే ప్రమాదం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలన్నారు.
-
జగన్ కు జనాలిచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా సరిపోలేదేమో..మంత్రి లోకేష్ సెటైర్లు -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..!












Click it and Unblock the Notifications