ఏపీకి రూ 70 వేల కోట్ల పెట్టుబడులు - విశాఖ కేంద్రంగా..!!
ఏపీలో మరో భారీ పెట్టుబడి దిశగా చర్చలు జరుగుతున్నాయి. ఉక్కు రంగంలో దిగ్గజ సంస్థ ఆర్సెలార్ మిట్టల్ జపాన్‌కు చెందిన నిప్పన్ స్టీల్స్ జాయింట్ వెంచర్ కంపెనీ రెండు దశల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తితో ఉంది. దాదాపుగా రూ 70 వేల కోట్లు తొలి దశ పెట్టుబడిగా ప్రణాళికలు సిద్దం అవుతున్నాయి. ఈ ఒప్పందం కార్యాచరణ అమలవుతే రాష్ట్ర చరిత్రలోనే ఇది తొలి భారీ పెట్టుబడిగా నిలవనుంది.
అనకాపల్లి వద్ద ప్లాంట్
ఆర్సెలార్ మిట్టల్ సంస్థ నుంచి ఏపీ ప్రభుత్వానికి తాజాగా ఒక ప్రతిపాదన వచ్చింది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. నాలుగేళ్ల కాలంలో 2029 నాటికి ప్లాంట్ పూర్తి చేసి తొలి దశ ఉత్పత్తి ప్రారంభిస్తామని పేర్కొంది. ఇప్పటికే అధికారుల తో సంస్థ ప్రతినిధులు ఈ ప్రతిపాదన పైన ప్రాధమిక చర్చలు చేసారు. ఆర్సెలార్ మిట్టల్ ఏపీ ప్రభుత్వం ముందు కీలక ప్రతిపాదనలు చేసింది. స్టీల్ ప్లాంట్‌తో పాటు క్యాప్టివ్ అవసరాల కోసం పోర్టు, రైల్ యార్డు నిర్మాణానికి ప్రభుత్వ అనుమతులు ఇవ్వాలని కోరింది.

ప్రభుత్వంతో చర్చలు
తాము ఏర్పాటు చేసే స్టీల్ ప్లాంట్ తొలి దశలో 7.3 మిలియన్ మెట్రిక్ వార్షిక ఉత్పత్తి చేస్తుందని అంచనాలను వెల్లడించింది. ప్లాంట్ నిర్మాణ సమయంలో 25 వేల మందికి.. ఆ తరువాత సంస్థ నిర్వహణ కోసం 20 వేల మంది వరకు ఉపాధి అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఇదే సమయంలో అనకాపల్లి బల్క్‌డ్రగ్ పార్కు కోసం ప్రతిపాదించిన 2200 ఎకరాలను మొదటి దశ ప్లాంట్ నిర్మాణానికి వినియోగించుకునే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో భూసేకరణ పనుల జాప్యం లేకుండా వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించడానికి అవకాశం ఉంటుందని తమ అభిప్రాయంగా వెల్లడించింది.
తాజా ప్రతిపాదనలతో
క్యాప్టివ్ అవసరాల కోసం పోర్టు నిర్మాణానికి ప్లాంట్‌కు సమీపంలో 3000ల మీటర్ల పొడవున సముద్ర తీర ప్రాంతాన్ని కేటాయించాలని విజ్ఞప్తి చేసింది. టౌన్‌షిప్ అభివృద్ధి కోసం మరో 440 ఎకరాలను కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరింది. ఛత్తీస్‌గఢ్‌లో ఎన్ఎండీసీకి కేటాయించిన గనుల నుంచి ప్లాంట్‌కు అవసరమైన ముడి ఖనిజాన్ని తీసుకోనున్నట్లు సంస్థ వివరించింది. దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించేందుకు ఆర్సెలార్ మిట్టల్- నిప్పన్ స్టీల్స్, ఎన్ఎండీసీ, ఏపీఐఐసీ మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల అందరికీ ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనల్లో పేర్కొంది. ఏపీ ప్రభుత్వం ఈ ప్రతిపాదనల పైన తమ వైఖరి స్పష్టం చేసిన తరువాత పూర్తి స్థాయిలో ఒప్పందం జరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
-
గ్యాస్, పెట్రోల్, డీజిల్ పై ఏపీ వాసులకు సూపర్ న్యూస్.. మీకు దిగులు లేదు! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా!












Click it and Unblock the Notifications