హైదరాబాద్ టు అమరావతి: పిల్లలకు లోకల్ స్టేటస్ ఇవ్వాలని అశోక్
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి వచ్చే ఉద్యోగుల పిల్లలకు లోకల్ స్టేటస్ కల్పించాలని లా సెక్రటరీని కోరినట్లు ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షులు అశోక్ బాబు మంగళవారం నాడు చెప్పారు.
ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగుల తరలింపులో ఎవరికి ఇబ్బందులు కలగవద్దని ఆయన అభిప్రాయపడ్డారు. ఎవరికీ ఇబ్బందులు లేనివిధంగా ఏపీ ప్రభుత్వాన్ని హైదరాబాద్ నుంచి తరలించాలని కోరినట్లు చెప్పారు. వసతుల కల్పనలో ఉద్యోగుల డిమాండ్లు పరిగణలోకి తీసుకోవాలన్నారు.
ఉద్యోగ సంఘాలతో ఏపీ ఉన్నతాధికారుల భేటీ

ఉద్యోగ సంఘాలతో ఏపీ ఉన్నతాధికారుల కమిటీ మంగళవారం నాడు భేటీ అయ్యారు. స్థానికత అంశం పైన అభిప్రాయాలను సేకరించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ... పుట్టిన స్థలం ఆధారంగా స్థానికతను నిర్ధారించాలని కోరారు.
పది రోజుల్లోగా మరోసారి ఉద్యోగులతో ఏపీ ఉన్నతాధికారుల కమిటీ భేటీ కానుంది. ఆ తర్వాత డ్రాఫ్ట్ నివేదిక పైన ఉద్యోగ సంఘాల అభిప్రాయం తీసుకోనుంది. అనంతరం ఉద్యోగుల అభిప్రాయాన్ని కేంద్రానికి పంపించనుంది.












Click it and Unblock the Notifications