భండారీని కలిసిన మాట నిజమే, కాల్స్‌పై విచారణ: అశోక్ గజపతి ప్రకటన

న్యూఢిల్లీ: ఆయుధ వ్యాపారి సంజయ్ భండారి నుంచి తన ఓఎస్డీ అప్పారావుకు 355 కాల్స్ వచ్చాయనే విషయంపై విచారణ జరిపిస్తామని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పి. అశోక్ గజపతిరాజు చెప్పారు. సంజయ్ భండారీని ఏడాదిన్నర క్రితం జరిగిన ఎయిర్‌షోలో కలిసి మాట నిజమేనని అంగీకరించారు.

తనను ప్రధానమంత్రి కార్యాలయం ఏ వివరణా అడగలేదని చెప్పారు. తాను అవినీతిని సహించబోనని చెప్పారు. తన వ్యక్తిగత సిబ్బంది కూడా అవినీతికి ఏ విధమైన తావు ఇవ్వరని చెప్పారు. తన వ్యక్తిగత సిబ్బందిపై తనకు నమ్మకం ఉందని చెప్పారు. తన వ్యక్తిగత సిబ్బంది తప్పులు చేయరని, తప్పులు చేస్తే మాత్రం దానికి తనదే బాధ్యతని చెప్పారు.

Ashok Gajapathi Raju says Sanjay Bhandari met him

కేంద్రంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం అవినీతిని పూర్తిగా పారదోలిందని అశోక్ గజపతిరాజు చెప్పారు. కేంద్రంపై అవినీతి ఆరోపణలు ఉంటే చెప్పాలని ఆయన మీడియా ప్రతినిధులకు సూచించారు. సంజయ్ భండారీ అశోక్ గజపతి రాజును బెంగళూర్ ఎయిర్‌షో సందర్భంగా కలిశారని అశోక్ గజపతి రాజు ఓఎస్డీ అప్పారావు కూడా చెప్పారు.

కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు చెందినట్లు భావిస్తున్న ఇంటిని కొన్నట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న ఆయుధ వ్యాపారి సంజయ్ భండారీ‌ వ్యవహారంలో పౌర విమానయాన శాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు ఓఎస్డీ అప్పారావు పేరు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. నిరుడు అప్పారావుతో భండారీ ఫోన్‌లో 355 సార్లు మాట్లాడినట్లు విచారణలో తేలినట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+