అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌కు నమస్కారం, తాగునీటికి ఇబ్బంది పెట్టారు: బాబ్లీ నోటీసులపై అశోక్, కూతురు పోటీ పైనా..

|
Google Oneindia TeluguNews

అమరావతి: బాబ్లీ ఘటనలో ధర్మాబాద్ పోలీసులు తెలుగుదేశం పార్టీ నేతలతో నాడు దారుణంగా వ్యవహరించారని కేంద్రమాజీ మంత్రి, టీడీపీ ఎంపీ అశోక్ గజపతి రాజు సోమవారం అన్నారు. ఐదు రోజులు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పెట్టారని చెప్పారు. తెలంగాణ రైతుల హక్కుల కోసం టీడీపీ నాడు పోరాటం చేసిందని చెప్పారు.

నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాలా లేక ఎంపీగా పోటీ చేయాలా అనే విషయం పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని తెలిపారు. తనకు అయితే ఎంపీగా బరిలో నిలవాలని ఉందని చెప్పారు. తన కూతురు ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో ఏమీ చెప్పలేనని అన్నారు. తండ్రి పాలనను తెస్తానని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ చెబితే నమస్కారం పెడతామన్నారు.

మల్లాది విష్ణుకు సంకేతాలు, అలిగివెళ్లిన వంగవీటి రాధా: అధిష్టానం హెచ్చరికమల్లాది విష్ణుకు సంకేతాలు, అలిగివెళ్లిన వంగవీటి రాధా: అధిష్టానం హెచ్చరిక

వైయస్ లాంటి దారుణ పాలన ఎవరికీ అవసరం లేదు

వైయస్ లాంటి దారుణ పాలన ఎవరికీ అవసరం లేదు

వైయస్ రాజశేఖర రెడ్డి లాంటి దారుణమైన పాలన ఎవరికీ అవసరం లేదని అశోక్ గజపతి రాజు చెప్పారు. విభజన సమయంలో హామీ ఇచ్చిన బీజేపీ, ఏపీ ప్రజలకు న్యాయం చేయలేకపోయిందని విమర్శంచారు. అందుకే ఎన్డీయే నుంచి బయటకు వచ్చినట్లు ఆయన తెలిపారు. జాతీయ పార్టీలు ప్రజలకు దూరం అవుతున్నాయని చెప్పారు. కాగా, అశోక్ గజపతి రాజు అంతకుముందు ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. బాబ్లీ ప్రాజెక్టుకు సంబంధించి నోటీసులపై చర్చించారు.

జగన్, ఆళ్ల అమరావతికి పట్టిన దుష్టగ్రహాలు

జగన్, ఆళ్ల అమరావతికి పట్టిన దుష్టగ్రహాలు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ నేత ఆళ్ల రామకృష్ణా రెడ్డిలు రాజధాని అమరావతికి పట్టిన దుష్టగ్రహాలను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న సోమవారం మండిపడ్డారు. బెజవాడ హోటళ్లలో వైసీపీ మాఫియా, గ్యాంగ్‌ను దించారని చెప్పారు. అసెంబ్లీ ముట్టడి పేరుతో అలజడి సృష్టించాలని కుట్ర చేస్తున్నారన్నారు.

జగన్ బ్యాచ్ దొనకొండలో దోచుకుంది

జగన్ బ్యాచ్ దొనకొండలో దోచుకుంది


జగన్, బొత్స సత్యనారాయణ, భూమన కరుణాకర్ రెడ్డిలు అవినీతి పైన మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. జగన్ అతని బ్యాచ్ దొనకొండలో వేల ఎకరాలు దోచుకుందన్నారు. దొనకొండలో రాజధాని వస్తుందని అక్కడి రైతులను జగన్ నమ్మించారని ఆరోపించారు. వైసీపీ గ్రాఫ్ రోజు రోజుకు తగ్గుతోందన్నారు.

చంద్రబాబు చేయని అరాచకం లేదు

చంద్రబాబు చేయని అరాచకం లేదు

అమరావతి పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు చేయని అరాచకం లేదని కాంగ్రెస్ నేత సీ రామచంద్రయ్య ధ్వజమెత్తారు. రాజధాని అమరావతికి ఎంత అప్పు చేశారో తెలియదని, ఎంత ఖర్చు పెట్టారో కూడా తెలియదన్నారు. రాజధాని నిర్మాణ ఖర్చులు, అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి ఎన్నికల స్టంట్ అని ఆరోపించారు.

English summary
Former Union Minister and Telugudesam Party MP Ashok Gajapathi Raju talks about notices to Chandrababu and daughter contesting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X