'జైలుకు వెళ్లి వచ్చి, అధికారంలోకి వచ్చేందుకు జగన్ ప్రయత్నం'
జైలుకు వెళ్లి,బెయిల్ పైన వచ్చిన కొందరు రాజకీయ నాయకులు అధికారంలోకి రావడానికి ప్రజల్లోకి వస్తున్నారని,వారికి సరైన రీతిలో ప్రజలు బుద్ధి చెప్పాలని అశోక్ గజపతి రాజు వైసిపి అధినేత జగన్‌ను ఉద్దేశించి అన్నారు
అమరావతి: జైలుకు వెళ్లి, బెయిల్ పైన వచ్చిన కొందరు రాజకీయ నాయకులు అధికారంలోకి రావడానికి ప్రజల్లోకి వస్తున్నారని, వారికి సరైన రీతిలో ప్రజలు బుద్ధి చెప్పాలని కేంద్రమంత్రి, టిడిపి నేత అశోక్ గజపతి రాజు వైసిపి అధినేత జగన్‌ను ఉద్దేశించి అన్నారు.
మంగళవారం విజయనగరం జిల్లా ఉండి మండలం మహదేవపట్నం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన పరిశీలించారు. నర్సాపురం ఎంపీ గోకరాజు గంగరాజు దత్తత తీసుకున్న ఈ గ్రామంలో డంపింగ్ యార్డు నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా అశోక్ గజపతి రాజు మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి కట్టుగా పని చేస్తేనే అభివృద్ధి వేగవంతమవుతుందన్నారు. జైలుకు వెళ్లి వచ్చిన నాయకులకు ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు.
కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారనీ ఏపీ మంత్రి, బిజెపి నేత మాణిక్యాల రావు అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కల్లబొల్లి కబుర్లు చెప్పి రాష్ట్రంలో అడుగుపెట్టారని విమర్శించారు.












Click it and Unblock the Notifications