ఫేస్ బుక్ పోస్ట్ ఎఫెక్ట్.. జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్‌పై సస్పెన్షన్ వేటు !!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి సంచలన నిర్ణయం తీసుకుంది. తిరుపతి ప్రాంతీయ ఆడిట్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంలో అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేస్తున్న ఎన్. సుభాష్ చంద్రబోస్ పై సస్పెన్షన్ వేటు వేసింది. సోషల్ మీడియాలో అమరావతి రాజధానిపై ఆయన చేసిన ఫేస్ బుక్ పోస్ట్ ఇందుకు కారణం కావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
అసలు ఏం జరిగిందంటే..?
సుభాష్ చంద్రబోస్ తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో అమరావతి వరదల్లో మునిగిపోయిందంటూ ఫోటోలు షేర్ చేశారు. సదరు పోస్టుల్లో "అమరావతి కోసం మూడు రిజర్వాయర్లేంటి? అమరావతినే రిజర్వాయర్‌గా కడితే సరిపోతుంది కదా" అని ఉంది. అలానే "ఒకే వర్షం చాలు.. అమరావతి జలమయం" అంటూ రాసుకొచ్చారు. ఇందుకు నీరుకొండ-పెదపరిమి ప్రాంతాల్లో నీట మునిగిన పొలాల ఫొటోలను షేర్ చేశారు.

అయితే ఈ పోస్టులు కాస్తా వైరల్ గా మారడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వ ఉద్యోగి అయిన వ్యక్తి ఇలా అమరావతిపై తప్పుడు ప్రచారం చేయడం పట్ల పలువురు ప్రభుత్వానికి ఫిర్యాదులు పంపించారు. దీంతో అధికార యంత్రాంగం వెంటనే చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు సుభాష్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసి, వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
కాగా సర్కారు నోటీసులు పట్ల ఆయన స్పందిస్తూ.. తాను పెట్టిన పోస్ట్ వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే" అని సమాధానం ఇచ్చారు. అయితే ఈ వివరణతో అసంతృప్తి చెందిన ప్రభుత్వం, ఆయనను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఇక ఈ సంఘటన ప్రభుత్వ ఉద్యోగులు సోషల్ మీడియా వాడకంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో మరోసారి నిరూపించింది. వ్యక్తిగత అభిప్రాయం పేరుతో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే, ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతినే అవకాశం ఉందని.. ఇలాంటి సందర్భాల్లో ఉద్యోగాలపైనా ముప్పు తప్పదని ఈ హెచ్చరిస్తున్నారు. కొందరు అయితే "ప్రభుత్వ ఉద్యోగి అయితే ఇలాంటివి అసలు చేయకూడదు. సస్పెన్షన్ సరైన శిక్ష" అంటూ కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరు మాత్రం "వ్యక్తిగత అభిప్రాయం చెప్పారనే కారణంతో సస్పెండ్ చేయడం కాస్త కఠినమే" అని రాసుకొస్తున్నారు.
-
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
AP Property Tax: ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు బిగ్ అలర్ట్..! ఇంకా ఐదు రోజులే ఆఫర్.. -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
14కు మార్కాపురం బస్సు ప్రమాద మృతులు.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు! -
అమరావతి ఇక నుంచి.. ఏపీ కేబినెట్ సంచలన తీర్మానం..!! -
ఈ ప్రాంతాల్లో వంట గ్యాస్ సరఫరా పై ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇక నుంచి..!! -
ఎల్పీజీ స్ధానంలో PNG కనెక్షన్ తీసుకుంటే - ఏపీ సర్కార్ భారీ సబ్సిడీ ఆఫర్ ..! -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
ఏపీలో పర్యాటకానికి మహర్దశ.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు -
Amaravati: పీఎంవో అత్యవసర ఆదేశాలు-28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక భేటీ..! -
ఏపీ సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ భేటీ..! -
దివ్యాంగులకు అండగా "పెద్ది" సినిమా నిర్మాత వెంకట సతీష్ కిలారు..!












Click it and Unblock the Notifications