జగన్‌కు షాక్..వైసీపీ ఎన్ని సీట్లు గెలుస్తుందో చెప్పిన వేణు స్వామి
సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయ్యారు. సమంత, నాగచైతన్యలు వైవాహిక జీవితం అంత సాఫీగా సాగదని ముందే చెప్పి సంచలనం సృష్టించారాయన. వేణు స్వామి చెప్పిన విధంగానే సమంత, నాగచైతన్య విడిపోయారు. ఆ తరువాత మెగా డాటర్ నిహారిక విడాకులు, రెబల్ స్టార్ ప్రభాస్ ఆదిపురుష్ సినిమా ఫ్లాప్ గురించి ముందే చెప్పి సోషల్ మీడియాలో ఫుల్ పాపులారిటీని సంపాదించకున్నారాయన.
దీంతో సోషల్ మీడియాలో వేణు స్వామి జ్యోతిష్యానికి ఒక రేంజ్‌లో క్రేజ్ పెరిగింది. ఇక రాజకీయ నాయకుల జాతకాలు గురించి ఆయన చెప్పినవి చెప్పినట్టుగానే జరుగుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు 2023లో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటారని ముందే వేణు స్వామి చెప్పడం జరిగింది. ఆయన చెప్పినట్టుగానే చంద్రబాబు స్కిల్ స్కాంలో అరెస్ట్ అయ్యారు. . కవిత జాతకంలో జైలుకు వెళ్లే యోగం ఉందని వేణు స్వామి ముందే చెప్పారు.వేణు స్వామి చెప్పిన కొద్ది రోజుల్లో లిక్కర్ స్కాంలో కవిత అరెస్ట్ అయ్యారు.

ఇక ఏపీలో మరోసారి సీఎం జగనే అంటూ పలు సందర్భాల్లో వాఖ్యానించిన వేణు స్వామి.. తాజాగా వచ్చే ఎన్నికల్లో అధికార వైసీపీ ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందో కూడా తెలిపారు. ఏపీలో జగన్ మరోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారని వేణు స్వామి కుండబద్దలు కొట్టేశారు. 79 సీట్లలలో వైసీపీ వన్ సైడ్‌గా గెలుస్తుందని.. 30 నుంచి 40 సీట్లలలో టఫ్ ఫైట్ ఉంటుందని వేణు స్వామి తెలిపారు. 95 సీట్ల నుంచి 125 సీట్ల వరకు వైసీపీ విజయం సాధించే అవకాశాలున్నాయని వేణు స్వామి చెప్పుకొచ్చారు.
అంతేకాకుండా 2029 ఎన్నికల్లో కూడా గెలిచి జగన్ హ్యాట్రిక్ సీఎంగా రికార్డు సృష్టిస్తారని వేణు స్వామి తెలిపారు. భవిష్యత్తులో ఏపీలోని ఓ రాజకీయ పార్టీ కనుమరుగు అవుతుందని వేణు స్వామి జోస్యం చెప్పారు. అయితే గతంలో కంటే ఎక్కువ స్థానాలే గెలుస్తామని జగన్ చెప్పిన దానికంటే కొన్ని స్థానాలు తగ్గుతాయని వేణు స్వామి చెప్పడంతో వైసీపీ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.మరి వేణు స్వామి చెప్పినట్టుగా వైసీపీ 135 స్థానాల్లో విజయం సాధించి జగన్ మరోసారి సీఎం అవుతారో లేదో తెలియాలంటే జూన్ 4 వరకు వేచి చూడాలి.












Click it and Unblock the Notifications