Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆత్మకూరు బైపోల్ ఏకగ్రీవం కాదు..!! మేకపాటి బంధువే ఆ పార్టీ అభ్యర్ధిగా : వైసీపీ నుంచి ఖరారు..!!

ఆత్మకూరు బైపోల్ ప్రకటన ఏ క్షణమైనా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ ఎన్నిక ఏకగ్రీవం అవుతుందా..లేక, ఎన్నిక జరుగుతుందా..ఇప్పటికే ఎన్నికల సంఘం ఉప ఎన్నికలు నిర్వహించాల్సిన నియోజకవర్గాల పై సమీక్షలు ప్రారంభించింది. అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తరువాత ఎమ్మెల్యేలుగా ఎన్నికైన కొందరు పార్లమెంట్ కు... లోక్ సభ కు ఎన్నికైన ఎందరు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసారు. వాటితో పాటుగా ఏపీలో ఖాళీ అయిన ఆత్మకూరు అసెంబ్లీ నియోజక వర్గానికి బై పోల్ జరగనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏపీ అసెంబ్లీ ఖాళీని నోటిఫై చేస్తూ ఎన్నికల సంఘానికి సమాచారం ఇచ్చింది. దీంతో..వైసీపీ అభ్యర్ధి ఏకగ్రీవంగా ఎన్నిక జరుగుతుందా..లేక, పోటీ ఉంటుందా అనేదే ఇప్పుడు కీలక చర్చకు కారణమైంది.

ఏకగ్రీవమా - ఎన్నిక జరిగేనా

ఏకగ్రీవమా - ఎన్నిక జరిగేనా


గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో రాజకీయాలు - పార్టీలకు అతీతంగా అందరూ బాధ పడ్డారు. నివాళి అర్పించారు. ఆత్మకూరు కు జరిగే బై పోల్ లో మేకపాటి కుటుంబం నుంచి ఎవరైనా పోటీకి దిగితే...ఇతర పార్టీలు పోట చేయవని అందరూ భావించారు. ఏపీలో ఇప్పటి వరకు ఒకటి రెండు సందర్భాల్లో మినహా.. సిట్టింగ్ ఎమ్మెల్యేలు మరణిస్తే వారి కుటుంబ సభ్యులే బరిలో నిలిస్తే..పోటీకి పెట్టకుండా ఒక సంప్రదాయంగా పాటిస్తున్నారు. నంద్యాలలో భూమా నాగిరెడ్డి మరణంతో నంద్యాల ఉప ఎన్నిక రాగా..ఆ ఎన్నికలో ప్రధాన పార్టీలు పోటీ పడ్డాయి. తమ పార్టీ నుంచి గెలిచిన భూమా..పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరటం..ఆక్కడ టీడీపీ అభ్యర్ధికి ఏకగ్రీవం చేయటానికి వైసీపీ సహకరించలేదు. అంతకు ముందు తిరుపతి..నందిగామ ఎన్నికల్లో మాత్రం టీడీపీ అభ్యర్ధులు మరణించిన సమయంలో వైసీపీ పోటీ పెట్టలేదు.

పోటీ చేస్తానంటున్న మేకపాటి బంధువు

పోటీ చేస్తానంటున్న మేకపాటి బంధువు

ఇక, కడప జిల్లా బద్వేలు లో సిట్టింగ్ ఎమ్మెల్యే మరణించటంతో..మరణించిన ఎమ్మెల్యే సుబ్బయ్య సతీమణికే వైసీపీ టికెట్ కేటాయించింది. కానీ, బీజేపీ తమది జాతీయ పార్టీ..తమ విధానాలు ప్రత్యేకమని చెబుతూ బరిలో నిలిచింది. ఇక, ఇప్పుడు ఆత్మకూరులో టీడీపీ పోటీకి దూరంగా ఉండాలనే భావిస్తోంది. ఇదే సమయంలో మేకపాటి బంధువు సడన్ గా ఎంట్రీ ఇచ్చారు. బిజువేముల రవీంద్రరెడ్డి అనే వ్యక్తి మేకపాటి రాజమోహన్ రెడ్డికి స్వయంగా మేనల్లుడు. ఆయన ఇప్పుడు ఆత్మకూరు నుంచి తాను బీజేపీ అభ్యర్ధిగా బరిలో నిలుస్తానని..మెట్ట ప్రాంతానికి న్యాయం చేయాలనేదే తన డిమాండ్ అని నినదిస్తున్నారు. బద్వేలు తరహాలో బీజేపీ పోటికి సిద్దమైతే ఆయనే ఆ పార్టీ అభ్యర్ది కావటం ఖాయంగా కనిపిస్తోంది.

బీజేపీ పోటీకి అవకాశం ఇస్తే..లేకున్నా

బీజేపీ పోటీకి అవకాశం ఇస్తే..లేకున్నా

బీజేపీ పోటీకి చివరి నిమిషంలో నో చెప్పినా..తాను స్వతంత్రంగా అయినా పోటీ చేస్తానని రవీంద్రరెడ్డి చెబుతున్నారు. ఇక, వైసీపీ నుంచి మేకపాటి కుటుంబం గౌతమ్ స్థానంలో ఆయన సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డిని ఖరారు చేసింది. విక్రమ్ రెడ్డి ఆత్మకూరు నుంచి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తారని మేకపాటి రాజమోహన్ రెడ్డి ..సీఎం జగన్ కు సమాచారం ఇచ్చారు. ఆయన వైసీపీ అభ్యర్దిగా పోటీ చేయటం ఖాయం. అయితే, టీడీపీ - జనసేన మాత్రం పోటీకి దిగే అవకాశాలు లేవు. బీజేపీ తమ అభ్యర్ధిని బరిలోకి దింపుతుందా లేదా అనేది అధికారికంగా వెల్లడించలేదు. రవీంద్ర రెడ్డి బీజేపీ అభ్యర్దిగా లేదా స్వతంత్ర అభ్యర్ధిగా పోటీలో ఉంటే..ఎన్నిక అనివార్యంగా మారనుంది.

వైసీపీ నుంచి బరిలో విక్రమ్ రెడ్డి

వైసీపీ నుంచి బరిలో విక్రమ్ రెడ్డి

అయితే, గౌతమ్ కు గౌరవసూచకంగా రవీంద్ర రెడ్డిని సైతం బరిలోకి దిగకుండా నిలువరించేందుకు కొందరు పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఏపీలో వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం ఇప్పటికే ప్రధాన పార్టీలు పోటీ పడుతున్న వేళ..ఆత్మకూరు బై పోల్ ఏకగ్రీవం అవుతుందా లేదా అనేది ఆసక్తి కరంగా మారుతోంది. ఎన్నిక అనివార్యంగా మారితే...మరోసారి రాజకీయ పోరాటానికి ఆత్మకూరు వేదికగా మారనుంది. దీంతో..బైపోల్ షెడ్యూల్ విడుదల అవుతూనే..ఈ మొత్తం వ్యవహారం పైన స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+