స్పీకర్ ఫై దాడి కేసు .. ఇనుమెట్లలో పోలీసుల గాలింపు .. ఉద్రిక్తత

Recommended Video

    స్పీకర్ ఫై దాడి కేసు .. ఇనుమెట్లలో పోలీసుల గాలింపు,ఉద్రిక్తత..!! || Oneindia Telugu

    ఏపీ స్పీకర్, సత్తెనపల్లి నియోజకవర్గం నుండి పోటీ చేసిన కోడెలపై దాడి చేసింది ఎవరు ? ఎవరి ప్రోద్బలంతో దాడికి పాల్పడ్డారు ? వంటి అంశాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు . దాడి చేసింది ఎవరో గుర్తించేందుకు వీడియో ఫుటేజ్ సహాయం తీసుకుంటున్నారు. ఏప్రిల్ 13వ తేదీ శనివారం ఇనుమెట్ల గ్రామానికి భారీగా పోలీసులు చేరుకున్నారు. డోర్ టు డోర్ జల్లెడ పడుతున్నారు పోలీసులు. ఈ దాడిలో మొత్తం ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. దీనితో అక్కడ మరోసారి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది .

    కోడెలపై ఇనుమెట్లలో దాడి ... ఆవేదనకు గురైన కోడెల

    Attack on Speaker .. police case filed and force in Inumetla created tension

    ఏప్రిల్ 11వ తేదీన ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల పోలింగ్ సమయంలో గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం ఇనుమెట్లలో స్పీకర్ కోడెలపై దాడి జరిగింది. ఆయన పోలింగ్ బూత్‌కు చేరుకోవడంపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనపై దాడికి దిగారు. కోడెల స్పృహ తప్పి పడిపోయారు . అగంతకులు కోడెల కారుని ద్వంసం చేశారు . భయాందోళన సృష్టించారు . కోడెల దుస్తులు చిరిగిపోయాయి. ఆయనతో పాటు డ్రైవర్‌కి గాయాలయ్యాయి. కోడెల తనపై జరిగిన దాడి ఘటనపై తీవ్రంగా ఆవేదన చెందారు.

    ఇనుమెట్లలో ఇల్లిల్లు జల్లెడ పడుతున్న పోలీసులు .. నిందితులు ఆరుగురు అరెస్ట్

    దాడి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందటంతో పోలీసులు ఈ వ్యవహారాన్ని సీరియస్ గానే తీసుకున్నారు. దాడికి సంబంధించిన వీడియోలను పరిశీలించారు పోలీసులు. దీంతో సత్తెనపల్లి డివిజన్ నుండి 50 మంది పోలీసుల బృందం శనివారం ఇనుమెట్లకు చేరుకుంది. దాడి చేసింది ఎవరనేది జల్లెడ పడుతున్నారు పోలీసులు . గ్రామం నుండి ఎవరినీ బయటకు వెళ్లకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్న పోలీసులు కొందరు అనుమానితులను పెట్టుకున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+