రెండో భార్య ఇంటిపై నుంచి పడి ఆస్ట్రేలియన్ మృతి

మృతుడి కుమారుడు ఆస్ట్రేలియా నుంచి ఇక్కడికి వచ్చాడు. అతనికి తండ్రి మృతదేహాన్ని పోలీసులు అప్పగించారు. ఆస్ట్రేలియాలో ఇంజనీరుగా పనిచేసి పదవీ విరమణ చేసిన 77 ఏళ్ల వాలంటైన్ రేమండ్ స్టోన్ 20 ఏళ్ల క్రితం క్రిస్టియన్ మిషనరీలతో పాటు వచ్చి ఇక్కడే స్థిరపడిపోయాడని మొయినాబాద్ ఇన్‌స్పెక్టర్ ఎస్ రవిచంద్ర చెప్పారు.
ఈ నెల 6వ తేదీన వాలంటైన్ ప్రమాదవశాత్తు తన భార్య సి. సత్యమ్మ ఇంటి టెర్రాస్‌పై నుంచి కిందపడ్డాడు. దీంతో అతని తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. దాంతో అతను మరణించాడు. ఆస్ట్రేలియాలో ఉన్న అతని కుమారుడు మైకెల్‌కు పోలీసులు సమాచారం అందించారు. మైకెల్ గురువారంనాడు హైదరాబాదు వచ్చి తండ్రి మృతదేహాన్ని తీసుకున్నాడు.
ఇరవై ఏళ్ల క్రితం వచ్చిన వాలైంటెన్ అప్పటి నుంచి సత్యమ్మ నివాసంలోనే ఉంటున్నాడు. అనుమానాస్పద మృతి కింద పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications