ఏపీ, తెలంగాణ వాటర్ వార్ కు త్వరలో తెర-వరదలతో ఆటోమేటిగ్గా చెక్-కేంద్రం మౌనం అందుకే

ఏపీ, తెలంగాణ మధ్య రాయలసీమ లిఫ్ట్ నిర్మాణం విషయంలో ప్రారంభమైన జల యుద్ధం శ్రీశైలం, పులిచింతల ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తిపై అభ్యంతరాలకు చేరింది. చివరికి జల యుద్ధంపై ఇరు రాష్టాలు కేంద్రం, కృష్ణా రివర్ బోర్డుకు లేఖలు రాసి ఒత్తిడి పెంచే వరకూ వెళ్లాయి. దీంతో ఈ వ్యవహారం కేంద్రం కోర్టులోకి చేరింది. అయితే ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న ఈ వివాదాలకు త్వరలో ఆటోమేటిగ్గా ముగింపు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తప్పనిసరి పరిస్ధితుల్లో తమ ఫిర్యాదులపై జగన్, కేసీఆర్ మౌనంగా ఉండిపోవచ్చని తెలుస్తోంది.

 ఏపీ, తెలంగాణ వాటర్ వార్

ఏపీ, తెలంగాణ వాటర్ వార్

ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న వాటర్ వార్ పతాక స్ధాయికి చేరుకుంది. ఏపీ నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ పై తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంటే దానికి కౌంటర్ గా తెలంగాణ కూడా ఏపీకి కూడా వాటా ఉన్న శ్రీశైలం, పులిచింతల ప్రాజెక్టుల్లో విద్యుత్ ఉత్పత్తి చేపట్టింది. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్ధితులు నెలకొంటున్నాయి. ఈ వ్యవహారం ఇరు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీల్ని సైతం కుదిపేస్తోంది. ఇరు రాష్ట్రాల మధ్య గతంలో ఎన్నడూ లేనంత స్ధాయిలో సాగుతున్న ఈ జలయుద్ధానికి ముగింపు ఎప్పుడున్న చర్చ కూడా సాగుతోంది. అయితే ఎవరికి వారే మొండిగా వ్యవహరిస్తుండంతో సయోధ్య సాధ్యం కావడం లేదు.

 త్వరలో శుభం కార్డు

త్వరలో శుభం కార్డు

ఏపీ, తెలంగాణ మధ్య నీటి పారుదల ప్రాజెక్టులతో పాటు విద్యుత్ ఉత్పత్తి విషయంలో నెలకొన్న ప్రతిష్టంభనపై ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ మిశ్రమ స్పందన వస్తోంది. అయితే ఈ వాటర్ వార్ విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య సయోధ్య చేసేందుకు కూడా కేంద్రం వెంటనే సిద్దపడే పరిస్ధితులు కూడా కనిపించడం లేదు. దీనికి ప్రధాన కారణం త్వరలో ఈ వివాదాలకు ఆటోమేటిగ్గా తెరపడుతుందని భావించడమే. అందుకే కేంద్రం ఏపీ, తెలంగాణ ఫిర్యాదులపై తాను నేరుగా స్పందించకుండా కృష్ణా రివర్ బోర్డుతో నోటీసులు పంపుతున్నట్లు తెలుస్తోంది.

 కృష్ణానది వరదలతో వాటర్ వార్ కు చెక్

కృష్ణానది వరదలతో వాటర్ వార్ కు చెక్

ప్రస్తుతం వర్షాకాలం కావడం, ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తుండటం ఏపీ, తెలంగాణ వాటర్ పార్ పై ప్రభావం చూపబోతోంది. కృష్ణానదిలోకి భారీగా వరదనీరు చేరుతుండటంతో ప్రాజెక్టులు జలకళను సంతరించుకోనున్నాయి. ఇప్పటికే జూరాలతో పాటు తుంగభద్ర నుంచి వస్తున్న నీటితో కృష్ణా డెల్టాకు భారీగా నీరు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే శ్రీశైలం నుంచి సాగర్ కు, అక్కడి నుంచి పులిచింతల, ప్రకాశం బ్యారేజీకి కూడా భారీగా వరద నీరు రావడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో సహజంగానే మా నీరు, మీ నీరు అనే వాదనకు చెక్ పడబోతోంది. తెలంగాణ మా నీటిని తోడేస్తుందన్న ఏపీ వాదన కూడా చెల్లకుండా పోతుంది. దీంతో తెలంగాణ కూడా ప్రస్తుతం కాస్త సంయమనం పాటిస్తే బెటరని అనుకుంటోంది. కేంద్రం కూడా ఇదే అభిప్రాయంతో ఉండటంతో మరికొన్ని రోజుల్లో ఆటోమేటిగ్గానే ఈ వార్ కు తెరపడనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+