అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట : చిరంజీవి, పవన్ కళ్యాణ్ భావోద్వేగం!!
అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం, బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంతో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. అభిజిత్ ముహూర్తంలో శ్రీరాముడి ప్రతిష్టాపన కార్యక్రమం 12. 29 నిమిషాలకు జరిగింది 84 సెకండ్ల పాటు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ భావోద్వేగానికి గురయ్యారు.
నేడు అయోధ్య మాత్రమే కాదు భారతదేశమంతా శ్రీరామ నామస్మరణతో మారుమోగుతోంది. ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరైన వారంతా శ్రీరామ విగ్రహ ప్రతిష్టాపన చూసి పులకించి పోయారు. అయోధ్యలో బాల రామయ్య విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట కోసం వెళ్లిన పవన్ కళ్యాణ్ సైతం భావోద్వేగానికి గురయ్యారు. ప్రాణ ప్రతిష్టకు ముందు పవన్ కళ్యాణ్ అయోధ్య రామాలయం ప్రతి భారతీయుడు కల అని పేర్కొన్నారు.

భారతీయ నాగరికతకు రామచంద్ర ప్రభువే మూలకారకుడు అని అయోధ్యకు రామయ్యను తీసుకురావడానికి 500 సంవత్సరాల సమయం పట్టిందన్నారు. ఎట్టకేలకు 500 సంవత్సరాల కల ఈరోజు సహకారం అయిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తాను చాలా భావోద్వేగానికి గురవుతున్నారని పేర్కొన్న పవన్ కళ్యాణ్ ఇటువంటి మహోన్నత కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు.
ఇక మరోవైపు చిరంజీవి కూడా చారిత్రాత్మక ఘట్టాన్ని చూసి భావోద్వేగానికి గురయ్యారు. అంతకుముందు ఈ ఘట్టాన్ని ఉద్దేశించి ట్వీట్ చేసిన చిరంజీవి అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం, విగ్రహ ప్రాణ ప్రతిష్ట ఘట్టం చరిత్ర సృష్టిస్తుందని, చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని, నిజంగా పరిమితమైన అనుభూతిని కలిగిస్తుందని పేర్కొన్నారు.
అయోధ్య నుండి ఆహ్వానం రావడం అయోధ్యలో రామ్‌లల్లాకు పట్టాభిషేకం చేయడానికి ఒక దేవుడిచ్చిన అవకాశంగా భావిస్తున్నానన్నారు. ఐదు వందల సంవత్సరాలకు పైగా తరతరాలుగా భారతీయుల నిరీక్షణ ఫలించబోతున్న ఆ మహత్తర అధ్యాయమని ఆయన కొనియాడారు. ఆ దివ్యమైన 'చిరంజీవి' హనుమంతుడు, అంజనా దేవి కుమారుడే స్వయంగా ఈ భూలోక అంజనాదేవి కొడుకు చిరంజీవికి ఈ అమూల్యమైన క్షణాలను చూసే బహుమతిని ఇచ్చినట్లు నాకు అనిపిస్తుందన్నారు. నిజంగా వర్ణించలేని అనుభూతి కలుగుతుందన్నారు.
నాకు మరియు నా కుటుంబ సభ్యులకు ఇది ఎన్నో జన్మల పుణ్యఫలం అని చిరంజీవి పేర్కొన్నారు. ప్రధాన మంత్రి మోడీకి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు హృదయపూర్వక అభినందనలు తెలియజేసిన చిరంజీవి ఈ మహత్తర సందర్భంలో ప్రతి భారతీయునికి హృదయపూర్వక అభినందనలు. ఈ బంగారు క్షణాలు తిరిగి రానివని జై శ్రీరామ్ అంటూ చిరంజీవి భావోద్వేగానికి గురయ్యారు.
-
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర..












Click it and Unblock the Notifications