వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చెత్తపై పన్నేంటి, చెత్త నా ..... ; డ్రైనేజీలు, టాయిలెట్స్ పై పన్నులా.. తుగ్లక్ జగన్ అంటూ అయ్యన్న ధ్వజం

|
Google Oneindia TeluguNews

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రెండున్నరేళ్ల పాలనపై టిడిపి నేతలు నిప్పులు చెరుగుతున్నారు. జగన్ పాలనలో ప్రజలపై పన్నుల భారం తప్ప ఒరిగిందేమీ లేదని ద్వజమెత్తారు. ప్రజల జీవన ప్రమాణాల పెంపు కోసం, ఆదాయం పెంచటం కోసం జగన్ సర్కార్ చేసిందేమీ లేదని మండిపడుతున్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి ప్రజలపై పన్నుల భారం మోపుతున్నారని నిప్పులు చెరుగుతున్నారు. ఇక తాజాగా టిడిపి సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు నర్సీపట్నం ప్రజలకు తుగ్లక్ ముఖ్యమంత్రి వేస్తున్న పన్నులను కట్టొద్దు అని పిలుపునిచ్చారు.

ఏపీలో పన్నుల బాదుడుపై ధ్వజమెత్తిన అయ్యన్న పాత్రుడు

ఏపీలో పన్నుల బాదుడుపై ధ్వజమెత్తిన అయ్యన్న పాత్రుడు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల కాలంలో మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో పన్నులను పెంచుతూ జగన్ నిర్ణయం తీసుకున్న విషయాన్ని ప్రస్తావించిన మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో కలిసి సీఎం జగన్ జీవో నెంబర్ 196 , జీవో నెంబర్ 197, 198 ల ద్వారా పన్నుల బాదుడుకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. ఇప్పటికే ఆస్తిపన్ను పెంచుతూ నిర్ణయం తీసుకున్న జగన్ ప్రజలపై పన్నుల భారం మోపుతున్నారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

 డ్రైనేజీ పై పన్ను, వాటర్ పై పన్ను, మరుగుదొడ్ల పై పన్ను.. వీర బాదుడే

డ్రైనేజీ పై పన్ను, వాటర్ పై పన్ను, మరుగుదొడ్ల పై పన్ను.. వీర బాదుడే

భవనాలు లేని ఖాళీ స్థలాలపై కూడా పన్నుల బాడుడుకు శ్రీకారం చుట్టారని, చెత్త పైన కూడా పన్ను వేస్తున్న చెత్త నా కొడుకు .. బుద్ధి ఉండాలని ఘాటుగా విమర్శలు గుప్పించారు . తుగ్లక్ నిర్ణయాలపై నిప్పులు చెరిగారు అయ్యన్నపాత్రుడు. అంతేకాదు డ్రైనేజీ పై పన్ను, వాటర్ పై పన్ను, మరుగుదొడ్ల పై పన్ను ఇలా ఒకటేమిటి అందినకాడికి ప్రజలను దోచుకోవాలని సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ఈ పన్నులను అడుగడుగునా వ్యతిరేకిస్తుందని తెలిపిన అయ్యన్నపాత్రుడు ప్రభుత్వం విధిస్తున్న పన్నుల లెక్కలను తెలిపారు.

చెత్తపై పన్ను, టాయ్ లెట్స్ , డ్రైనేజ్ పన్నుల బాదుడు లెక్క చెప్పిన అయ్యన్న

చెత్తపై పన్ను, టాయ్ లెట్స్ , డ్రైనేజ్ పన్నుల బాదుడు లెక్క చెప్పిన అయ్యన్న

ప్రభుత్వం చెత్త పై వేసే పన్నుకు చిన్న ఇల్లు అయితే నెలకు 60 రూపాయల చొప్పున, పెద్ద ఇల్లయితే 120 రూపాయలు చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఒక సంవత్సరానికి చిన్న ఇంటికి 720 రూపాయలు, పెద్ద ఇల్లయితే అయితే 1440 రూపాయల చొప్పున కేవలం చెత్త పైన పన్నుగా చెల్లించాల్సి ఉంటుందని లెక్క చెప్పారు అయ్యన్నపాత్రుడు. ఇది చెత్త నిర్ణయమని పేర్కొన్న అయ్యన్నపాత్రుడు తాము వ్యతిరేకించామని చెప్పుకొచ్చారు. ఇక టాయిలెట్స్ మీద వేసే పన్ను ఒక ఇంటిలో ఎన్ని టాయిలెట్స్ ఉంటే అన్ని 40 రూపాయల చొప్పున ప్రతి నెలా చెల్లించాలని లెక్క చెప్పారు.

Recommended Video

Salary, Working Hours పెరుగుతాయ్.. టేక్ హోమ్ వేతనంలో కోత | New Labour Code || Oneindia Telugu
ప్రభుత్వం ఖజానా ఖాళీ .. అందుకే పన్నుల బాదుడు .. ఆ పన్నులు కట్టొద్దన్న అయ్యన్న

ప్రభుత్వం ఖజానా ఖాళీ .. అందుకే పన్నుల బాదుడు .. ఆ పన్నులు కట్టొద్దన్న అయ్యన్న

ఇక మంచినీళ్ల పన్ను నెలకు ఒక ఇంటికి వంద రూపాయల చొప్పున వసూలు చేయడానికి జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుందని చెప్పి, ఆస్తిపై వేసే పన్ను కాక ఇవన్నీ అదనంగా చెల్లించాలని పన్నుల పేరుతో జగన్ సర్కార్ తీసుకున్నది తుగ్లక్ నిర్ణయమని అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. ప్రస్తుతం ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిందని, ఇష్టారాజ్యంగా నిధులు దుర్వినియోగం చేశారని పేర్కొన్న అయ్యన్నపాత్రుడు, ఏం చేయాలో అర్థం కాక ఇలా పన్నుల బాదుడుకు శ్రీకారం చుట్టారని విమర్శిస్తున్నారు. కొన్ని చోట్ల ప్రజలు ఇప్పటికే ఈ పన్నులను చెల్లించడానికి తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారని ప్రతి ఒక్కరు ఈ పన్నులను తీవ్రంగా వ్యతిరేకించాల్సిన, వైసీపీ ప్రభుత్వ తీరును ఖండించాల్సిన అవసరం ఉందని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.

English summary
It is known that Jagan govt has decided to increase property tax in AP. In this context, the former TDP minister deserves to be outraged over the exorbitant taxes raised and the decision taken by Jagan like tuglaq. A senior TDP leader called on the people of Narsipatnam to stop paying the Tughlaq taxes on garbage, tax on drainages, water supply and toilets.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X