నత్తి పకోడికి ఒక ఉద్యోగం రిజర్వ్ చెయ్యి జూమాంజి; జగన్, సాయిరెడ్డిపై అయ్యన్నపాత్రుడు వ్యంగ్యం

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి టిడిపి నేత మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ట్విట్టర్ వేదికగా విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎదురు దాడి చేశారు. వైసిపి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాబ్ మేళా పై సెటైర్లు వేసిన అయ్యన్నపాత్రుడు వైసీపీ నిర్వహిస్తున్న జాబ్ మేళాలో సాయిరెడ్డికి, జగన్ కు రెండు ఉద్యోగాలు రిజర్వు చేసుకోవాలంటూ సెటైర్లు వేశారు.

 నీ రాజ్యసభ, జగన్ రెడ్డి సీఎం పదవి పోయే రోజు దగ్గర పడింది: అయ్యన్న పాత్రుడు

నీ రాజ్యసభ, జగన్ రెడ్డి సీఎం పదవి పోయే రోజు దగ్గర పడింది: అయ్యన్న పాత్రుడు


ఇంట్లో వాళ్ళు ఎవరిని లెక్క చెయ్యడం లేదో సమాజం చూసింది వీసా రెడ్డి అంటూ పేర్కొన్న అయ్యన్నపాత్రుడు జగన్ రెడ్డిని ఛీకొట్టి తల్లి, చెల్లి, బావ పక్క రాష్ట్రానికి వెళ్లిపోవడం కంటే పెద్ద ఛీత్కారం ఏముంటుంది? చెప్పు అంటూ ప్రశ్నించారు. నీ రాజ్యసభ, జగన్ రెడ్డి సీఎం పదవి పోయే రోజు దగ్గర పడింది. ముందు జాగ్రత్త చర్యగా కార్యకర్తల కోసం నిర్వహిస్తున్న జాబ్ మేళా లో ఉద్యోగాలు రిజర్వ్ చేసుకోండి అంటూ విజయసాయి రెడ్డి కి సలహా ఇచ్చారు.

నిరుద్యోగులు జగన్ రెడ్డికి, నీకు బడిత పూజ చెయ్యడం ఖాయం: అయ్యన్న

నిరుద్యోగులు జగన్ రెడ్డికి, నీకు బడిత పూజ చెయ్యడం ఖాయం: అయ్యన్న


కార్యకర్తల జాబ్ మేళా కాదు హామీ ఇచ్చిన ప్రకారం ముందు 2.30 లక్షల ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చెయ్యండి లేకపోతే నిరుద్యోగులు జగన్ రెడ్డికి, నీకు బడిత పూజ చెయ్యడం ఖాయం అంటూ విజయసాయిరెడ్డిని టార్గెట్ చేసిన అయ్యన్నపాత్రుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.అంతేకాదు బ్రోకర్ జూమాంజి ముందు నత్తి పకోడీ హామీ ఇచ్చిన విధంగా 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ మేళా మొదలు పెట్టు అంటూ అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు.

 మీ నత్తి పకోడీ ఉద్యోగం ఊడి త్వరలో నిరుద్యోగి గా మారడం ఖాయం: అయ్యన్న

మీ నత్తి పకోడీ ఉద్యోగం ఊడి త్వరలో నిరుద్యోగి గా మారడం ఖాయం: అయ్యన్న


కార్యకర్తలకు జాబ్ మేళా నిర్వహిస్తున్న నిన్ను నిరుద్యోగ యువత తరిమికొట్టే రోజు దగ్గర్లోనే ఉందని మండిపడ్డారు. అన్నట్టు నీకు రాజ్యసభ రెన్యూవల్ లేదట కదా పార్టీ ఆఫీస్ లో కూర్చోని ట్వీట్లు వేసుకునే ఉద్యోగం ఇచ్చారట కదా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు అయ్యన్న పాత్రుడు. మీ నత్తి పకోడీ ఉద్యోగం ఊడి త్వరలో నిరుద్యోగి గా మారడం ఖాయం. ముందే నత్తి పకోడికి ఒక ఉద్యోగం రిజర్వ్ చెయ్యి జూమాంజి అంటూ అయ్యన్నపాత్రుడు జగన్ ను, విజయసాయి రెడ్డి ని టార్గెట్ చేశారు.

అయ్యన్నను టార్గెట్ చేసిన సాయిరెడ్డి వ్యంగ్యం ... ఆగని మాటల యుద్ధం

అయ్యన్నను టార్గెట్ చేసిన సాయిరెడ్డి వ్యంగ్యం ... ఆగని మాటల యుద్ధం

ఇదిలా ఉంటే నిన్నటికి నిన్న వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పోరస్ కెమికల్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాద ఘటనపై టిడిపి నేతలు చేసిన విమర్శలపై ఎదురు దాడి చేస్తూ అయ్యన్నపాత్రుడు ని టార్గెట్ చేశారు. పారిశ్రామిక ప్రమాదాలపై కూడా పేలాలు ఏరుకోవటం ఏమిటి అయ్యన్న అంటూ ప్రశ్నించిన విజయసాయిరెడ్డి, గోదావరి పుష్కరాలలో బాబు షూటింగ్ సరదా కారణంగా 30 మంది అమాయకులు చనిపోతే ఎంత మంది మంత్రులు పరుగెత్తుకు వెళ్లారు. మృతుల్లో ఉత్తరాంధ్ర భక్తులే ఎక్కువ. ఆ టైంలో నీవు ఏ రాచకార్యాల్లో మునిగావు? ఇప్పుడు నీతులు చెప్తున్నావ్ అంటూ విజయసాయిరెడ్డి అయ్యన్నపాత్రుడు ని టార్గెట్ చేశారు. ఇక తాజాగా వైసీపీ నిర్వహిస్తున్న జాబ్ మేళా పై విజయసాయి రెడ్డి ని టార్గెట్ చేస్తూ అయ్యన్నపాత్రుడు మరోమారు రెచ్చిపోయారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+