Badvel by-poll: బయట వ్యక్తులతో దొంగ ఓట్లు ..పోలింగ్ లో రగడ, పలు చోట్ల ఘర్షణలు, ఫిర్యాదులు !!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుండి రాత్రి ఏడు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.కరోనా ప్రోటోకాల్ నేపథ్యంలో సామాజిక దూర నిబంధనలు పాటిస్తూ బద్వేల్ ఉపఎన్నికల పోలింగ్ ను కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈరోజు ఉదయం తొమ్మిది గంటల వరకు బద్వేలు ఉప ఎన్నికల పోలింగ్ 10.49 శాతం నమోదయినట్లుగా తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న హుజురాబాద్ ఉప ఎన్నికల పోలింగ్ కూడా 9 గంటల వరకు 10.50% నమోదైనట్లు గా సమాచారం.

అట్లూరులో దొంగ ఓట్లు వెయ్యటానికి ప్రయత్నించిన మహిళలు

అట్లూరులో దొంగ ఓట్లు వెయ్యటానికి ప్రయత్నించిన మహిళలు

ఇక బద్వేలు ఉప ఎన్నికల పోలింగ్ అప్ డేట్స్ చూస్తే బద్వేల్ ఉప ఎన్నికల పోలింగ్ కు నియోజకవర్గంలో మొత్తం రెండు లక్షల 15 వేల 292 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. బద్వేలు నియోజకవర్గంలో అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు ఓటు వేసేందుకు బారులు తీరారు. బద్వేలు ఉపఎన్నికలో అట్లూరు మండలంలో దొంగ ఓట్లు వేయడానికి వచ్చిన మహిళలను ఎన్నికల అధికారులు అడ్డుకున్నారు. సరైన ఐడి కార్డులు లేవని వారిని వెనక్కి పంపించారు.

దొంగ ఓట్లు వేసే వారిని గుర్తించిన ఎస్ వెంకటాపురం గ్రామస్తులు .. పోలీసులకు అప్పగింత

దొంగ ఓట్లు వేసే వారిని గుర్తించిన ఎస్ వెంకటాపురం గ్రామస్తులు .. పోలీసులకు అప్పగింత


ఇదిలా ఉంటే బద్వేలు నియోజకవర్గంలోని అట్లూరు మండలం ఎస్ వెంకటాపురం లో కూడా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. దొంగ ఓట్లు వేయడానికి పోలింగ్ కేంద్రాలకు కొత్త వ్యక్తులు వచ్చినట్టు గుర్తించిన గ్రామస్తులు క్యూలో నిలబడిన ముగ్గురు వ్యక్తులను గుర్తించి వారిని పోలీసులకు అప్పగించారు. బద్వేల్ ఉప ఎన్నికల్లో ఓట్ల కోసం వైసీపీ అడ్డదారులు తొక్కుతుందని ఎన్నికల బరిలో ఉన్న ఇతర పార్టీల అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.

ఓటేసిన కాంగ్రెస్ అభ్యర్థి కమలమ్మ .. పోలింగ్ తీరుపై అసహనం

ఓటేసిన కాంగ్రెస్ అభ్యర్థి కమలమ్మ .. పోలింగ్ తీరుపై అసహనం

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బద్వేలు నియోజకవర్గంలో ఎన్నికల బరిలోకి దిగిన కమలమ్మ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కును వినియోగించుకున్న అభ్యర్థి కమలమ్మ మాట్లాడుతూ తిరుపతి ఉప ఎన్నికల మాదిరిగానే బద్వేలులో కూడా బయట వ్యక్తులు ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని, తీవ్ర అసహనం వ్యక్తం చేశారు .ఎన్నికలు సజావుగా జరిగేలా అధికారులు చూసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటే బద్వేలు చింతలచెరువు లో స్వల్ప ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది .బయట వ్యక్తులు పోలింగ్ ఏజెంట్లు గా ఎలా ఉంటారంటూ బీజేపీ పోలింగ్ ఏజెంట్ లపై వైసిపి కార్యకర్తలు ఆందోళనకు దిగారు .బీజేపీ ఏజెంట్లను అడ్డుకున్నారు .దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

బీజేపీ నేతలపై బెదిరింపులు .. ఎస్పీకి ఫిర్యాదు చేసిన సోము వీర్రాజు

బీజేపీ నేతలపై బెదిరింపులు .. ఎస్పీకి ఫిర్యాదు చేసిన సోము వీర్రాజు

బద్వేలు నియోజకవర్గంలోని పోరుమామిళ్లలో ఈవీఎంల సమస్య కారణంగా పోలింగ్ 20 నిమిషాల పాటు నిలిచిపోయింది. బద్వేలు నియోజకవర్గంలో పలు పోలింగ్ కేంద్రాలలో బిజెపి ఏజెంట్లను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. గోపవరం మండలం బుట్టాయి పల్లి జోగి రెడ్డి పల్లి గ్రామంలో బిజెపి నేతలపై బెదిరింపులకు పాల్పడుతున్నారని ఈ వ్యవహారంలో ఎస్ఐ చంద్రశేఖర్ పై చర్యలు తీసుకోవాలని సోము వీర్రాజు ఫిర్యాదు చేశారు .

బద్వేల్ పోలింగ్ శాతం పెంచటంపై ప్రధానంగా దృష్టి పెట్టిన వైసీపీ

బద్వేల్ పోలింగ్ శాతం పెంచటంపై ప్రధానంగా దృష్టి పెట్టిన వైసీపీ

తిరువెంగళాపురం పోలింగ్ కేంద్రం వద్ద కేంద్ర బలగాలు లేకపోవడంపై సోము వీర్రాజు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు పోరుమామిళ్లలో బయట వ్యక్తుల మోహరింపు విషయాన్ని సోము వీర్రాజు ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. ఇదిలా ఉంటే బద్వేలులో పోలింగ్ శాతం పెంచడం పైన వైసిపి ప్రధానంగా దృష్టి పెట్టినట్లు సమాచారం. బద్వేలు ఉపఎన్నిక ఏకపక్ష ఎన్నిక గా ఉండేలా అధికార పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+