అందుబాటులో ధర: క్యాన్సర్‌పై బాలకృష్ణ, చిన్నారికి చేయి (పిక్చర్స్)
హైదరాబాద్: క్యాన్సర్ వ్యాధుగ్రస్తులకు అందుబాటు ధరలో నాణ్యతతో కూడిన కార్పోరేట్ వైద్యాన్ని అందిస్తున్నట్లు సినీ నటుడు, హిందూపురం శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ సోమవారం అన్నారు.
బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి, పరిశోధన సంస్థలో ఓ కార్యక్రమంలో చైర్మన్ అయిన ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
భవిష్యత్తులో క్యాన్సర్ వ్యాధి నివారణకు అభివృద్ధి, నైపుణ్యం సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. క్యాన్సర్ వ్యాధి నివారణకు తమ ాసుపత్రి తరఫున అనేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.

బాలకృష్ణ
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా హైదరాబాదు బసవతాకరకం క్యాన్సర్ ఆసుపత్రిలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూపురం శాసన సభ్యుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ మాట్లాడారు. ఆసుపత్రి నిర్వహణలో లాభాలు ఆశించడం లేదన్నారు.

బాలకృష్ణ
లాభాలు ఆశించకుండా ఆసుపత్రిని నిర్వహిస్తున్నామన్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. క్యాన్సర్ వ్యాధి గురించి భయపడవలసిన పని లేదన్నారు. అది నయం అవుతుందన్నారు. ఆసుపత్రిలో ఆధునిక సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు.

బాలకృష్ణ
ఏపీ శాసన సభాపతి కోడల శివప్రసాద్ మాట్లాడుతూ.. తొలి దశలో గుర్తిస్తే క్యాన్సర్‌ను తగ్గించుకోవచ్చునని చెప్పారు. సెల్ ఫోన్ల వల్ల కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. పొగాకు, దాని ఉత్పత్తుల కారణంగా క్యాన్సర్ పీడితుల సంఖ్య పెరుగుతోందన్నారు.

బాలకృష్ణ
క్యాన్సర్ వ్యాధుగ్రస్తులకు అందుబాటు ధరలో నాణ్యతతో కూడిన కార్పోరేట్ వైద్యాన్ని అందిస్తున్నట్లు సినీ నటుడు, హిందూపురం శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ సోమవారం అన్నారు.












Click it and Unblock the Notifications