వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చరిత్ర తిరగరాస్తాం: బాలకృష్ణ, చిరంజీవి కోసం సొంతూరు వెయిటింగ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఏలూరు/అనంతపురం: శ్రీకృష్ణ దేవరాయల కాలంలో నిర్మించిన లేపాక్షి చరిత్రను తిరగ రాస్తామని అనంతపురం జిల్లా హిందూపురం శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. లేపాక్షిలో నంది ఉత్సవాల ఏర్పాట్ల పైన ఆయన అధికారులు, ప్రజాప్రతినిధులతో ఆదివారం సమీక్షించారు.

ఈ సందర్భంగా మాట్లాడారు. లేపాక్షిలో వీరభద్ర ఆలయానికి ఎంతో చరిత్ర ఉందన్నారు. అలాంటి ఆళయానికి కీర్తి తీసుకు రావాలనే ఉద్దేశ్యంతో నంది ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు సీఎం చంద్రబాబు సుముఖత వ్యక్తం చేశారన్నారు. ఈ ఉత్సవాలకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు.

మొగల్తూరులో గ్రామాన్ని దత్తత తీసుకుంటున్న చిరు

Balakrishna busy with Lepakshi festival, Chiranjeevi in adopted village

కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు, మాజీ కేంద్రమంత్రి చిరంజీవి సోమవారం నాడు తన సొంత మండలంలో సుడిగాలి పర్యటన చేయనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని తన సొంతూరు మొగల్తూరు వెళ్లనున్న చిరంజీవి... అక్కడి నుంచి తాను దత్తత తీసుకున్న పేరుపాలెం గ్రామానికి ర్యాలీగా బయలుదేరతారు.

సంసద్ ఆదర్శ గ్రామ యోజన కింద రాజ్యసభ సభ్యుడి హోదాలో ఆయన పేరుపాలెం సౌత్ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. గ్రామంలో అభివృద్ధి పనుల కోసం ఆయన ఇటీవలే తన ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి రూ.5 కోట్లను కేటాయించారు. ఆ అభివృద్ధి పనులకు సోమవారం చిరంజీవి శ్రీకారం చుడుతున్నారు.

చిరంజీవి పర్యటన నేపథ్యంలో మొగల్తూరు, పేరుపాలెంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఆయన అభిమానులు భారీ ఏర్పాట్లు చేశారు. చిరంజీవి పుట్టి పెరిగింది మొగల్తూరు, పేరుపాలెంలలోనే. పుట్టిన గడ్డకు ఆయన రుణం తీర్చుకునేందుకు ముందుకు వచ్చారు.

English summary
Balakrishna busy with Lepakshi festival, Chiranjeevi in adopted village.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X