తారకరత్న జ్ఞాపకార్ధం బాలకృష్ణ చేసిన పనికి జై బాలయ్య అంటూ అలేఖ్యా రెడ్డి ఎమోషనల్!!
తారకరత్న కోసం బాలకృష్ణ హృద్రోగ బాధితులకు ఉచిత చికిత్స అందించాలని నిర్ణయం తీసుకున్నారు. బసవతారకం ఆస్పత్రిలో ఒక బ్లాక్ కు తారకరత్న పేరు పెట్టారు. దీంతో జై బాలయ్య అంటూ అలేఖ్యా రెడ్డి ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
నందమూరి బాలకృష్ణ .. సహాయం చేయడంలో కానీ అవసరమైన చోట సంచలన నిర్ణయాలు తీసుకోవడంలో కానీ బాలకృష్ణకు లేరెవ్వరు పోటీ. నందమూరి తారకరత్న విషయంలో మొదటి నుంచి అన్నీ తానై దగ్గరుండి చూసుకున్న బాలకృష్ణ, నందమూరి తారకరత్న మరణించిన తర్వాత కూడా తారకరత్న కుటుంబానికి అండగా ఉంటానంటూ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్న బాలకృష్ణ, తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ గా పోస్ట్ పెట్టడానికి కారణమయ్యారు.

తారకరత్న కోసం బాలయ్య
బాలయ్య కొడుకులా ఆప్యాయంగా చూసుకున్న తారకరత్న నారా లోకేష్ పాదయాత్ర సమయంలో గుండెపోటుకు గురై దాదాపు 23 రోజులు పాటు మృత్యువుతో పోరాడి ఫిబ్రవరి 22వ తేదీన తుది శ్వాస విడిచారు. తారకరత్న వైద్యం విషయంలోనూ, తారకరత్న మరణించిన తర్వాత నిర్వహించిన కార్యక్రమాల విషయంలోనూ బాలయ్య ముందుండే అన్ని నడిపించారు. ముక్కు సూటి మనస్తత్వంతో ఉండే బాలయ్య తాను చేసే పని ఏదైనా సరే నిక్కచ్చిగా చేసి తీరుతారు. ఈ క్రమంలో బాలయ్య తారకరత్న కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటానని, పిల్లల బాధ్యత తనదేనని, భర్త మరణించిన తీవ్ర ఆవేదనలో ఉన్న అలేఖ్య రెడ్డికి భరోసా ఇచ్చారు.

గుండెజబ్బుల బాధితులకు ఉచిత చికిత్స.. బసవతారకం ఆస్పత్రిలో తారకరత్న బ్లాక్
ఇక తాజాగా తన గొప్ప మనసును చాటుకుంటూ బాలయ్య తారకరత్న జ్ఞాపకార్థం గుండెపోటు సమస్యలతో బాధపడుతున్న వారికి ఉచిత వైద్యం అందించాలని నిర్ణయం తీసుకున్నారు. గుండె సమస్యలతో బాధపడుతూ చికిత్స ఖర్చులు భరించలేని పేదవారికి పూర్తిగా ఉచితంగా వైద్యం అందించాలని బాలకృష్ణ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు బసవతారకం ఆసుపత్రిలో ఒక బ్లాక్ ను ఏర్పాటు చేసి ఆ బ్లాక్ కు తారకరత్న బ్లాక్ అని నామకరణం చేశారు. గుండె సమస్యలకు ఉచిత వైద్యం బసవతారకం ఆసుపత్రి తో పాటు హిందూపురంలో బాలకృష్ణ నిర్మిస్తున్న ఆసుపత్రిలో కూడా అందుబాటులో ఉంటుంది.
బాలయ్య బంగారు మనసు.. ప్రశంసల వెల్లువ
బాలకృష్ణ తన బంగారు మనసును మరోమారు చాటుకున్నారని అభిమానుల నుంచి ప్రశంసలు వెల్లువగా మారాయి. కొడుకు తారకరత్న పైన ప్రేమను ఇలా స్పష్టం చేయడంతో పాటు, హృద్రోగ బాధితులకు చికిత్స అందించడానికి బాలయ్య తీసుకున్న నిర్ణయం పట్ల ప్రతి ఒక్కరిలోనూ హర్షం వ్యక్తం అవుతుంది. బాలకృష్ణ తీసుకున్న నిర్ణయంతో తారక రత్న సతీమణి అలేఖ్య రెడ్డి బాలయ్యను ఉద్దేశించి పోస్ట్ పెడుతూ భావోద్వేగానికి గురయ్యారు.

ఎమోషనల్ పోస్ట్ పెట్టిన తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డి
తాను పెట్టిన పోస్టులో అలేఖ్య రెడ్డి నేనేం చెప్పగలను.. మీకు నా కృతజ్ఞతలు ఎలా తెలియజేయగలను. నేనేం చెప్పినా, ఏం చేసినా చాలా తక్కువగానే ఉంటుంది. మీరు బంగారం లాంటి హృదయం ఉన్న వ్యక్తి అని మరోసారి నిరూపితమైంది. మీరు నిజంగా ఆ పేరుకు అర్హులు అంటూ బాలకృష్ణను ఉద్దేశించి అలేఖ్య రెడ్డి పోస్ట్ పెట్టారు. మీరు తప్ప ఇటువంటి పని ఎవరు చేయలేరు అంటూ ఆమె పేర్కొన్నారు. ఒక తండ్రిగా ఒక స్నేహితుడిగా ఇంతకాలం ఉన్న మీలో ఇప్పుడు దేవుడిని చూస్తున్నాను అంటూ అలేఖ్య రెడ్డి ఎమోషనల్ అయ్యారు. మీరు చేసిన చర్యతో నాకు నోటి మాట రావడం లేదని పేర్కొన్నారు. మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో అంతగా మేము కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాము అంటూ జై బాలయ్య, జై జై బాలయ్య అంటూ అలేఖ్య రెడ్డి పోస్ట్ పెట్టారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!












Click it and Unblock the Notifications