బాలకృష్ణ వస్తున్నారు,ఒక్కరొక్కరుగా మేమొస్తాం: తారక్

ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు నందమూరి కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా ప్రచారం నిర్వహించి తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తామన్నారు. నందమూరి కుటుంబం ఎల్లప్పుడు టిడిపికి అండగా ఉంటుందని తెలిపారు. మహిళలకు సమాన ఆస్తి హక్కు కల్పించటం, ప్రజల వద్దకు పరిపాలన వంటి ఎజెండాలతో ప్రజల ముందుకెళ్ళనున్నట్లు తెలిపారు.
మద్యపాన నిషేధాన్ని అమలు చేసి, పేదవారికి పట్టెడన్నం అందించేందుకు తెలుగుదేశం కృషి చేస్తుందన్నారు. పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు తమ కుటుంబంతో పాటు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలన్నారు.
కాగా, 2014 ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం స్వర్గీయ నందమూరి తారక రామారావు కుటుంబ సభ్యులు కృషి చేస్తున్నారు. నారా లోకేష్ ఇప్పటికే వరుసగా భేటీలు జరుపుతున్నారు. బాలకృష్ణ కూడా గతంలో జిల్లా నేతలతో చర్చలు జరిపారు.












Click it and Unblock the Notifications