బాలినేనికి సినిమా చూపిస్తున్న జనసేన..!!
బాలినేని మౌనం వెనుక కారణం ఏంటి. జనసేనలో చేరిన తరువాత బాలినేని పూర్తిగా సైలెన్స్ పాటిస్తున్నారు. బాలినేని ఎన్డీఏ కూటమిలో చేరికను స్థానిక టీడీపీ ఎమ్మెల్యేతో సహా జనసేనలోని ఒక వర్గం వ్యతిరేకిస్తోంది. ఇప్పటికీ వారు బాలినేనితో కలిసి పని చేయటానికి ముందుకు రావటం లేదు. వైసీపీని వీడిన బాలినేని ఇప్పుడు తన సొంత ఇలాకాలో ఇప్పుడు రాజకీయంగా ఇబ్బంది కర పరిస్థితులు ఎదుర్కొంటున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
బాలినేనికి వ్యతిరేకంగా
మాజీ మంత్రి బాలినేని జనసేనలో చేరారు. వైసీపీలో చోటు చేసుకున్న పరిణామాలతో పార్టీ వీడారు. ఒంగోలులో భారీ బహిరంగ సభలో పవన్ సమక్షంలో జనసేనలో చేరుతానని తొలుత బాలినేని ప్రకటించినా..భాగస్వామ్య పార్టీల నుంచి వచ్చిన ఒత్తిడితో చివరకు పవన్ పార్టీ కార్యాలయంలోనే బాలినేనికి పార్టీ కండువా కప్పారు. పార్టీలో క్రియాశీలక బాధ్యతలు అప్పగిస్తారని పార్టీ నేతలు చెబుతూ వచ్చారు. కానీ, ఒంగోలులో మాత్రం బాలినేనితో కలిసి పని చేయటానికి టీడీపీ ససేమిరా అంటోంది. జనసేన నేతల్లోనూ బాలినేని పైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈ అంశం పైన పార్టీలో రెండు వర్గాలుగా విభేదాలు కనిపిస్తున్నాయి.

సహకరించని నేతలు
మాజీ మంత్రి బాలినేని తమ పార్టీలో చేరటాన్ని జనసేన జిల్లా అధ్యక్షుడు రియాజ్ వ్యతిరేకిస్తున్నారు. అవకాశం వచ్చిన ప్రతీ సందర్భంలోనూ బాలినేని తీరు పైన ఆయన మద్దతు దారులు మాటల తూటాలు పేల్చుతున్నారు. బాలినేని పార్టీలో రావటాన్ని స్వాగతిస్తున్న నేతల పైన జనసేనలోని మరి కొందరు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రియాజ్ ను వ్యతిరేకించే వర్గం మాత్రం బాలినేనికి మద్దతుగా నిలుస్తోంది. బాలినేని పార్టీలో చేరిన తరువాత ఇప్పటి వరకు రియాజ్ ను కలవలేదు. ఇదే సమయంలో జనసేన జిల్లా అధ్యక్షుడు మార్పు ఉంటుందంటూ బాలినేని మద్దతు దారులు ప్రచారం చేయటం జనసేన శ్రేణులకు ఆగ్రహం తెప్పిస్తోంది. ఒకప్పుడు యూత్ కాంగ్రెస్ లో బాలినేని ఫాలోయర్‌గా ఉన్న రియాజ్ 1999, 2004 ఎన్నికల టైంలో బాలినేని కోసం పనిచేశారు.
పవన్ పైనే బాలినేని భారం
ఇక, టీడీపీ స్థానిక ఎమ్మెల్యే దామచర్ల తొలి నుంచి బాలినేని పైన సీరియస్ గానే ఉంటున్నారు. తన పైన కేసులు ఉండటంతోనే జనసేనలోకి బాలినేని చేరుతున్నారని..ఆయనను పవన్ రక్షిస్తారా అంటూ దామచర్ల చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. బాలినేని జనసేనలో చేరే సమయంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లోనూ దామచర్ల ఫొటో ఉండటాన్ని ఆయన మద్దతు దారులు వ్యతిరేకించారు. టీడీపీ, జనసేన నేతలు ఇప్పటికీ బాలినేని పైన కేసుల విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఇలా తన చేరికతో రెండు పార్టీల్లోనూ వ్యతిరేకత ఉండటంతో పవన్ పైనే భారం వేసి బాలినేని మౌనంగా ఉంటున్నారు. మరి.. బాలినేని రాజకీయంగా ఎలా నెట్టుకొస్తారనేది భవిష్యత్ డిసైడ్ చేయాల్సిందే.
-
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!!












Click it and Unblock the Notifications