భర్త నిర్వాకం: ఫోర్న్‌సైట్‌లో భార్య ఫోటోలు, ఛాటింగ్
శ్రీకాకుళం: భార్యను అనుమానిస్తూ నిత్యం వేధింపులకు గురిచేసిన భర్త ఏకంగా ఆమె పేరుతోనే ఈమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసి అశ్లీల వెబ్‌సైట్‌లో ఆమె ఫోటోలు అప్‌లోడ్ చేశాడు. ఆమె పేరుతో ఛాటింగ్ చేస్తూ ఆమెకు పరిచయం ఉన్నవారికి మేసేజ్‌లు పంపుతూ మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ విషయం తెలుసుకొన్న భార్య సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా ధర్యాప్తు చేపట్టిన పోలీసులకు భర్త అసలు నిందితుడిగా గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొన్నారు.
బ్యాంకు మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న ఓ శాడిస్ట్ భార్యపైనే వేధింపులకు దిగాడు. భార్యకు తెలియకుండానే ఆమె పేరుతోనే అశ్లీల వెబ్‌సైట్‌లో అకౌంట్ క్రియేట్ చేశాడు. ఆమెను మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నాడు.
భార్యపై అనుమానంతో భర్త ఈ దారుణానికి పాల్పడ్డాడు. అయితే కొంత కాలం పాటు ఏం జరుగుతోందో కూడ ఆ బార్యకు తెలియని పరిస్థితి నెలకొంది. ఈ విషయమై
ఆమె తీవ్ర మానసికంగా ఇబ్బందులకు గురైంది. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయిస్తే పోలీసులు అసలు విషయాన్ని బయటపెట్టారు.

శాడిస్టు భర్త ఏం చేశాడంటే?
శ్రీకాకుళం జిల్లా అరసవెల్లిలో బ్యాంకు మేనేజర్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి తన భార్యను అనుమానించాడు. అతడి భార్య కూడ కొంత కాలం పాటు అక్కడే మరో బ్యాంకులో పనిచేసేది. అయితే భార్యపై భర్తకు అనుమానం వచ్చింది.ఈ అనుమానంతో భార్యను వేధించాలని నిర్ణయించుకొన్నాడు ఈ మేరకు తన భార్య పేరుతోనే అశ్లీల వెబ్‌సైట్‌లో అకౌంట్ క్రియేట్ చేసి ఛాటింగ్ చేయడం ప్రారంభించాడు.

మానసికంగాఇబ్బందులకు గురి చేశాడు
భార్య పేరుతో అకౌంట్ క్రియేట్ చేసి ఆమె ఛాటింగ్ చేస్తున్నట్టుగానే చాటింగ్ చేసేవాడు. ఆమెకు సన్నిహితులు, మిత్రులు, పరిచయం ఉన్న వారికి ఆ మేసేజ్ లు పంపేవాడు. ఈ మేసేజ్‌లతో ఆమె మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురైంది.

సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు
అరసవెల్లిలో కొంత కాలం పాటు పనిచేసిన ఆమె హైద్రాబాద్‌కు బదిలీపై వచ్చింది. అయితే ఆమె హైద్రాబాద్ కు వచ్చిన తర్వాత ఈ వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. అంతేకాదు భార్య, భర్తల మధ్య విభేధాలు కూడ ఎక్కవయ్యాయి. దీంతో బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఖంగుతిన్న భార్య
బాధితురాలి ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేశారు. ఈ విచారణలో భర్తే ఈ దారుణానికి పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు.దీంతో ఆమె ఖంగుతిన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నట్టు తెలుస్తోంది.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications