బ్యాంకులు, ఆఫీసులు, విద్యా సంస్థలకు పండుగ సెలవులు - ఎవరికి ఎప్పుడెప్పుడు..!!

బ్యాంకు వినియోగదారులకు బిగ్ అలర్ట్. వరుస సెలవుల పైన ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. ఈ సమయంలో బ్యాంకింగ్ సేవలకు అంతరాయం లేకుండా ప్రత్యామ్నాయ మార్గాల దిశగా వినియోగ దారులు ఆలోచన చేయాలని సూచిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ వారంలోనే మూడు రోజుల పాటు బ్యాంకులకు సెలవు ప్రకటించారు. ఇక, వచ్చే వారం శ్రీరామ నవమి తో పాటుగా ఆర్దిక సంవత్సర ముగింపు కారణంగా మరో రెండు రోజులు బ్యాంకులకు సెలవుగా ఉండనుంది.

ఈ వారంలో మూడు రోజులు బ్యాకింగ్ సేవల పైన ప్రభావం పడనుంది. వరుస పండుగల కారణం గా బ్యాంకులకు సెలవు ప్రకటించారు. ఉగాది, రంజాన్ వంటి రెండు పెద్ద పండుగలు ఈ వారంలో నే ఉన్నాయి. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకైతే వరుసగా 4 రోజులు సెలవులు రాబోతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉగాది సందర్భంగా మార్చి 19న సెలవు ప్రకటించింది ప్రభుత్వం. దీనితో పాటు రంజాన్ పండుగకు సంబంధించి మార్చి 21, మార్చి 22 తేదీలను సాధారణ సెలవులుగా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఈ సెలవులు చంద్ర దర్శనం ఆధారంగా మారే అవకాశం ఉంది. ఒకవేళ మార్చి 19న నెలవంక కనిపిస్తే, పండుగను మార్చి 20న జరుపుకుంటారు. అప్పుడు సెలవుల తేదీల్లో మార్పు ఉండనుంది. కాగా.. ప్రభుత్వం ప్రకటించిన దాని ప్రకారం మార్చి 19, 21, 22 రోజుల్లో స్కూళ్లు, కాలేజీలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు వంటి వాటికి సెలవు ప్రకటించారు.

banks-will-be-closed-in-both-telugu-states-on-march-21-due-to-ramzan-id-ugadi-here-the-details

వినియోగదారులకు కీలక సూచనలు

ఇక, మార్చి 21 శనివారం. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు వీకెండ్. ఆ తర్వాత రోజు ఆదివారం మార్చి 22. ఎలా చూసుకున్నా ఈ వారంలో వరుసగా సెలవులు కనిపిస్తున్నాయి. అదే విధంగా వచ్చే వారం సైతం బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. మార్చి 27 (శుక్రవారం) రోజున శ్రీరామనవమి కావటంతో తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేస్తారు. ఆ తర్వాత మార్చి 31 (మంగళవారం)న మహావీర్ జయంతి పండుగ. అయితే, అదే రోజు (మార్చి 31) ఆర్థిక సంవత్సరం చివరి రోజు కావడంతో బ్యాంకుల్లో వినియోగ దారులకు సేవలు అందవు. సిబ్బంది తమ ఆర్దిక సంవత్సరం ఖాతాల ముగింపు లెక్కలకే పరిమితం అవుతారు. దీంతో, వినియోగదారులు... లావాదేవీలు నిర్వహించే వారు తమ ఆర్థిక ప్రణాళికలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని బ్యాంకు అధికారులు సూచన చేస్తున్నారు. బ్యాకింగ్ సేవల కోసం వినియోగదారులు బ్యాంకులు అందిస్తున్న ప్రత్యామ్నాయ సేవలను వినియోగించుకోవాలని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+