కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీఎం జగన్ చేతికి బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ రిపోర్ట్, ఆ నివేదికలో ఏముంది..?

|
Google Oneindia TeluguNews

రాజధాని మార్పుపై వేసిన మరో కమిటీ బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు తన నివేదికను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి అందజేసింది. క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో కమిటీ సభ్యులు సమావేశమై.. రిపోర్ట్ అందజేశారు. స్ట్రాటజీ ఫర్ బ్యాలెన్స్‌డ్ అండ్ ఇన్‌క్లూజివ్ గ్రోత్ బిగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పేరుతో కమిటీ నివేదిక ఇచ్చింది. కమిటీ ఇప్పటికే మధ్యంతర నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే. బోస్టన్ కమిటీ కూడా జీఎన్ రావు కమిటీ మాదిరిగానే ప్రతిపాదనలు ఉండే అవకాశం ఉంది.

సోమవారం భేటీ

సోమవారం భేటీ

రాజధాని మార్పుపై ఇప్పటికే జీఎన్ రావు కమిటీ నివేదిక అందజేసిన సంగతి తెలిసిందే. బీసీజే నివేదిక అందడంతో.. మంత్రులు, ఐఏఎస్ అధికారులతో వేసిన హై పవర్ కమిటీ సోమవారం సమావేశం కానున్నది. జీఎన్ రావు కమిటీ, బీసీజీ కమిటీ నివేదికలను పరిశీలిస్తోంది. దీంతోపాటు శివరామకృష్ణ కమిటీ ప్రతిపాదనలను పరిశీలించి.. హై పవర్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఈ నెల 8వ తేదీన జరిగే మంత్రివర్గ సమావేశంలో హై పవర్ కమిటీ నివేదికపై చర్చ జరగనుంది.

హై పవర్ కమిటీ రిపోర్ట్

హై పవర్ కమిటీ రిపోర్ట్


ఈ నెల 20వ తేదీ లోపు హై పవర్ కమిటీ నివేదిక అందజేస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వారం అటు ఇటుగా ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి.. రాజధాని మార్పు ప్రక్రియను జగన్ ప్రభుత్వం చేపట్టే అవకాశం ఉంది.

అఖిలపక్ష సమావేశం కూడా..

అఖిలపక్ష సమావేశం కూడా..

రాజధాని మార్పునకు సంబంధించి నివేదికలపై అసెంబ్లీలో చర్చిస్తారు. సభ్యుల అభిప్రాయం తీసుకొని.. హై పవర్ కమిటీ నివేదిక ఆధారంగా రాజధాని మార్పు ప్రక్రియ చేపట్టే అవకాశం ఉందని విశ్వసనీయంగా తెలిసింది. అంతకుముందు అఖిలపక్ష సమావేశం కూడా నిర్వహించి, అందరి అభిప్రాయాలను తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.

English summary
bcg committee submit report to cm jagan mohan reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X