త్రిష ఎఫెక్ట్: టీవీకేకు ప్రముఖ నటి గుడ్ బై: విజయ్ పై ఆరోపణలు

నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఏప్రిల్ 9వ తేదీన కేరళ, అదే నెల 23వ తేదీన తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఒకేదశలో ఇవి ముగుస్తాయి. మే 4వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. ఈ వివరాలను కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఎన్నికలు ఎదుర్కొంటోన్న నాలుగు రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ కూడా ఉంది. ఈ రాష్ట్రంతో పాటు తమిళనాడు, కేరళ, అస్సాం, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరీ ఉన్నాయి.

ఈ పరిణామాల మధ్య టీవీకేకు బిగ్ షాక్ తగిలింది. ప్రముఖ నటి, సామాజిక కార్యకర్త రంజన నాచియార్.. ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. డీఎంకేలో చేరారు. పార్టీ ప్రారంభం నుండీ టీవీకేలో ఉన్న ఆమె.. తాజాగా బయటికొచ్చారు. ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ సమక్షంలో కండువా కప్పుకొన్నారు. టీవీకే నుంచి వైదొలగడానికి కారణాలను మీడియాకు వివరించారు. టీవీకే నాయకత్వంపై ఆరోపణలు గుప్పించారు. మహిళలను గౌరవించడం తెలియదని విమర్శించారు. నేతలు అందుబాటులో ఉండట్లేదని ధ్వజమెత్తారు.

Actress Ranjana Nachiyar Resigns from the Vijay TVK Citing Disrespect to Women and Joins DMK

పార్టీ నాయకులకు కార్యకర్తల ఇబ్బందులు పట్టట్లేదని, మహిళలను పదే పదే అగౌరవపరుస్తున్నారని రంజన ధ్వజమెత్తారు. ముఖ్యంగా విజయ్ తన పూర్వీకురాలు రాణి వేలు నాచియార్ ప్రతిబింబంగా తనను తాను చూపిస్తూ కించపర్చుతున్నారని ఆమె స్పష్టం చేశారు. అటు బీజేపీ, దాని మిత్రపక్షం ఏఐఏడీఎంకేపైనా ఆమె విమర్శలు చేశారు. తమిళనాడుపై హిందీ బలవంతంగా రుద్దడానికి ప్రయత్నిస్తోందని, దీన్ని తిప్పికొట్టాలని ఓటర్లను కోరారు. త్రిభాషా సూత్రం తమిళనాడు భాషా వారసత్వాన్ని దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

బీజేపీ అన్ని రాష్ట్రాలను తన గుప్పిట్లో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తోందని, కేంద్రీకృత విధానాల వల్ల తమిళనాడుకు నష్టమని రంజన పేర్కొన్నారు. అతి జాతీయవాద పోకడలు తమిళనాడులో చెల్లబోవని అన్నారు. ప్రాంతీయ సున్నితత్వాలను గుర్తించడంలో బీజేపీ విఫలమైందని, మహిళా నాయకులకు సరైన గౌరవం ఇవ్వడం లేదని విమర్శించారు. గతంలో రంజనా నాచియార్ సుదీర్ఘకాలం పాటు బీజేపీలో కొనసాగారు. సుమారు ఎనిమిది సంవత్సరాల పాటు పనిచేశారు. 2025 ఫిబ్రవరిలో ఆమె బీజేపీని వీడారు. ఆ తర్వాత టీవీకేలో చేరినా ఎక్కవ కాలం పాటు అక్కడ కొనసాగలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+