అప్రమత్తంగా ఉండండి.. గందరగోళం సృష్టించే ప్రయత్నాలు: పార్టీకి పవన్ హెచ్చరిక!
కొంతమంది గందరగోళం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని, వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
హైదరాబాద్: పార్టీ స్థాపించి మూడేళ్లకు పైబడ్డా.. ఇప్పటికీ జనసేన అంటే ప'వన్' మాన్ షోనే. ఆ అపప్రదను తొలగించుకుని పార్టీని విస్తరించుకోవాలన్న ఉద్దేశంలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోను పార్టీ కార్యకర్తలను పెంచుకునే పనిలో పడ్డారు పవన్.
ఈ నేపథ్యంలోనే ప్రతీ జిల్లాలోను శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేసి.. పార్టీ అవసరాలకు అనుగుణంగా ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకుంటున్నారు. ఈ తతంగం ఇంకా పూర్తి కాకముందే.. కొంతమంది వ్యక్తులు తాము జనసేన నియమించిన నేతలమంటూ జిల్లాల్లో హల్ చల్ చేస్తున్నారు. మరికొంతమంది మరో అడుగు ముందుకేసి.. ఏకంగా వసూళ్లకు కూడా దిగుతున్నారు.
దీంతో ఈ విషయమై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు షిర్యాదులు అందాయి. విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ఆయన.. పార్టీకి డ్యామేజీ జరగకముందే యాక్షన్ లోకి దిగిపోయారు. ఈ మేరకు ఓ ప్రెస్ నోట్ కూడా విడుదల చేశారు. జనసేన కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలంటూ అందులో పేర్కొన్నారు. పార్టీ తరుపున అధికారిక ప్రతినిధులెవరిని నియమించలేదని తెలిపారు.
గందరగోళం సృష్టించడానికే:
" జనసేన పార్టీ అధికార ప్రతినిధులమని కొందరు వ్యక్తులు ప్రచారం చేసుకుంటూ జనసేన శ్రేణుల మధ్య గందరగోళం సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నట్టు ఈ మధ్యకాలంలో నా దృష్టికి వచ్చింది. ఒకసారి పార్టీ ప్రచార కార్యదర్శిగాను, మరోసారి అధికార ప్రతినిధిని అంటూ మీడియావారితో కూడా పార్టీ తరపున మాట్లాడుతున్నట్టు జనసేన కార్యాలయానికి ఫిర్యాదులు అందుతున్నాయి." అని పవన్ పేర్కొన్నారు.

వాస్తవాలు చెప్పడానికే:
"కృష్ణా జిల్లాలో అయితే తాను పార్టీ ప్రతినిధినని, విరాళాలు ఇవ్వాలని కూడా ఒక వ్యక్తి కొన్ని ప్రయత్నాలు చేసినట్టు తెలిసింది. అందువల్ల ఈ సందర్భంగా జనసేన శ్రేణులు, మీడియా వారికి వాస్తవాలు తెలియజేయడానికి ఈ ప్రకటనను విడుదల చేస్తున్నాము. జనసేన తరపున చర్చల్లో పాల్గొనడానికి ఎవరినీ నియమించలేదు." అని లేఖలో పవన్ చెప్పుకొచ్చారు.
Recommended Video


పార్టీకి సంబంధం లేదు
" ఆ వ్యక్తులు చెప్పే మాటలు, వ్యాఖ్యలతో పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. విరాళాలు అడిగిన వారి వివరాలను పార్టీ కార్యాలయానికి తెలియజేయండి. పార్టీ నిర్మాణం కోసం తీవ్రమైన కసరత్తు చేస్తున్నాము. అన్ని అర్హతలు ఉన్న వ్యక్తులనే పార్టీ తరపున ప్రతినిధులుగా నియమిస్తాము. ఆ సమాచారాన్నిఅధికారికంగా తెలియజేస్తాము." అని పవన్ చెప్పారు.

వారిని నమ్మవద్దు
"ఈలోగా పార్టీ ప్రతినిధులమని ఎవరైనా ప్రచారం చేసుకున్నా, విరాళాలు వంటివి అడిగినా అటువంటి వారి మోసకారి మాటలను విశ్వసించవద్దని తెలుపుతున్నాను. అటువంటివారిపై జనసేన శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను. జైహింద్" అని ముగించారు పవన్.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్












Click it and Unblock the Notifications