రోజా అలా, నేడు మిథున్ రెడ్డి ఇలా: పవన్ కళ్యాణ్‌కు జగన్ దూరం వెనుక
హైదరాబాద్: ఏపీకి ప్రత్యేక హోదా కోసం కాకినాడలో సీమాంధ్రుల ఆత్మగౌరవం పేరిట సభ నిర్వహిస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి మద్దతు లభించింది! వైసిపి ఎంపీ మిథున్ రెడ్డి శుక్రవారం నాడు పవన్ సభ పైన స్పందించారు.
పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా పైన చిత్తశుద్ధితో పోరాడితే తాము స్వాగతిస్తామని చెప్పారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ కావాలని, అలాగే ప్రత్యేక హోదా కావాలన్నారు. ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు అని మిథున్ రెడ్డి అన్నారు.

ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ... ప్రత్యేక హోదా పైన పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధితో పోరాడటం లేదన్నారు. హోదా పైన జగన్, వైసిపి మాత్రమే చిత్తశుద్ధితో పోరాడుతోందని వ్యాఖ్యానించారు. ఇప్పుడు మిథున్ రెడ్డి మాత్రం హోదా పైన పవన్ చిత్తశుద్ధితో పోరాడితే స్వాగతిస్తామని చెప్పారు.
ప్రత్యేక హోదా పైన పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగిన తర్వాత ఓ విధంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్నర్ అయిందనే వాదనలు ఉన్నాయి. ప్రత్యేక హోదా ద్వారా పవన్.. జగన్‌ను కార్నర్ చేశారని అంటున్నారు. ఆ కారణంగానే పవన్ హోదా ఉద్యమానికి అధికార, విపక్షాలు మద్దతిస్తున్నా, వైసిపి మాత్రం వ్యతిరేకిస్తోందనే వాదనలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications