అధిక వడ్డీ ఆశపెట్టి మోసం: ముగ్గురి అరెస్టు

Best India golden Estate men arrested
తిరుపతి: తక్కువ రోజుల్లో ఎక్కువ వడ్డీ ఇస్తామంటూ ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేశారనే ఆరోపణపై ది బెస్ట్ ఇండియా గోల్డెన్ ఎస్టేట్ నిర్వాహకులు ముగ్గురిని తిరుపతి క్రైం పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వీరి నుంచి 3లక్షల 15వేలు నగదు, మోటారు సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ఆ సంఘటన వివరాలను తిరుపతి అర్బన్ ఎస్పీ గోపినాధ్ జెట్టీ సోమవారం తన కార్యాలయంలో మీడియా ప్రతినిధులకు అందించారు. తిరుపతిలోని శ్రీనివాసం ఎదురుగా ఉన్న మున్సిపల్ కాంప్లెక్స్‌లో 16వ నెంబరు షాపును బాడుగకు తీసుకుని ఈ కంపెనీని ఏర్పాటు చేశారని తెలిపారు.

ఈ కంపెనీకి ఎండిగా విజయనగరానికి చెందిన గురవం శ్రీనివాస పట్నాయక్ (50) వ్యవహరిస్తుండగా, ఎమ్మార్‌పల్లి, రామాంజులపల్లికి, ఉద్యోగనగర్‌కు చెందిన గొల్ల సామ్యూల్ (35), హైదరాబాద్‌కు చెందిన చిట్టిమనేని సుగుణ (45) సభ్యులుగా వ్యవహరించేవారన్నారు. ఈ కంపెనీలో 10వేల రూపాయలు కడితే, వెంటనే కట్టిన సభ్యునికి 3వేల రూపాయల నగదు, లేదా ఒక గ్రాము బంగారం అప్పుడే ఇస్తారు. వారానికి వెయ్యి రూపాయలు వడ్డీ చెల్లిస్తారు.

లక్ష రూపాయలు కడితే సభ్యునికి 30వేల రూపాయల అప్పుడే చెల్లించి, వారానికి 10వేల రూపాయలు వడ్డీ ఇస్తామని, 5 నెలలకు లక్ష రూపాయులు రెట్టింపు చేసి రెండు లక్షల రూపాయలు ఇస్తామని ప్రజలను నమ్మించారన్నారు. వీరి మాయ మాటలు నమ్మి 20 మంది చేత 10 వేల రూపాయలు, మరో ఇద్దరి దగ్గర రెండు లక్షల రూపాయాలు చొప్పున కట్టించుకున్నారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+