జగన్, బాబు మధ్య అంతే తేడా: పవన్ హిట్టే!(పిక్చర్స్)
హైదరాబాద్: సీమాంధ్రలో తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మధ్యన పోటీ పోటీ ఉన్నట్లు పోలింగ్ సరళిని బట్టి రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
ఏ పార్టీ గెలిచినా పది పదిహేను సీట్ల తేడాతోనే అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఎక్కువగా టిడిపి వైపే మొగ్గు చూపుతున్నట్లు చెబుతున్నారు.
సీమాంధ్రలో జగన్, చంద్రబాబుల మెజార్టీ పైన, రోజా గెలుపు, మెజార్టీ పైన జోరుగా పందాలు కాస్తున్నారు. సీమాంధ్రలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ 88. ఏ పార్టీ గెలిచినా పది అటు ఇటు వస్తాయని లెక్కలు వేస్తున్నారు.

చంద్రబాబు, వైయస్ జగన్
సీమాంధ్రలో తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల మధ్య పోటా పోటీ నెలకొన్నప్పటికీ ఎక్కువ మంది టిడిపి వైపే మొగ్గు చూపుతున్నారట. అంతేకాకుండా ఎవరి గెలిచినా 10 లేదా 15 సీట్ల తేడా మాత్రమే ఉంటుందని భావిస్తున్నారు. పందెరాయుళ్లు కూడా టిడిపి గెలుపు పైనే ఎక్కువగా బెట్ కాస్తున్నారట.

చంద్రబాబు
టిడిపి, బిజెపి కూటమి 95 నుండి 105 సీట్ల వరకు గెలువచ్చునని లెక్కలు వస్తున్నారు. బిజెపికి ఇచ్చిన పద్నాలు స్థానాల్లోను పలువురు గెలుపు బాట పట్టనున్నారట. అయితే టిడిపి మాత్రం తాము 120కి పైగా స్థానాలు గెలుస్తామని చెబుతోంది.

వైయస్ జగన్
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 80 నుండి 83 సీట్లు గెలుచుకోవచ్చునని లెక్కలు వేస్తున్నారు. అయితే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మాత్రం తాము 140 స్థానాలు ఖచ్చితంగా గెలుస్తామని చెబుతున్నారు.

రోజా
ప్రముఖ సినీ నటి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మహిళా నాయకురాలు రోజా నగరి నియోజకవర్గం నుండి బరిలో నిలిచారు. ఆమె గెలుపుతో పాటు మెజార్టీ పైన పందాలు కాస్తున్నారట.

పవన్, మోడీ ప్రభావం
తెలుగుదేశం పార్టీ కోసం ప్రచారం చేసిన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రభావం కనిపించిందని చాలామంది భావిస్తున్నారు. అలాగే మోడీ వేవ్ కూడా కనిపిస్తోందని అంటున్నారు. ఆ కారణంగానే టిడిపి వైపు మొగ్గి చూపి ఉంటారని అంటున్నారు.












Click it and Unblock the Notifications