Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నంద్యాల బైపోల్: కోట్లలో బెట్టింగ్‌లు, మెజారిటీపైనే

నంద్యాల ఉపఎన్నిక ముగిసింది. ఉపఎన్నికల్లో భారీగా పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం టిడిపి, వైసీపీలు తీవ్రంగా ప్రయత్నించాయి.ఓట్ల లెక్కింపుకు నాలుగు రోజులపాటు గడువుంది.

నంద్యాల: నంద్యాల ఉపఎన్నిక ముగిసింది. ఉపఎన్నికల్లో భారీగా పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం టిడిపి, వైసీపీలు తీవ్రంగా ప్రయత్నించాయి.ఓట్ల లెక్కింపుకు నాలుగు రోజులపాటు గడువుంది. ఈ తరుణంలో నంద్యాల ఉపఎన్నిక ఫలితంపై జోరుగా బెట్టింగ్‌లు సాగుతున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బెట్టింగ్‌రాయుళ్ళు ఈ ఎన్నిక ఫలితంపై బెట్టింగ్ కాస్తున్నారు.

నంద్యాల ఉపఎన్నిక ఫలితాలు ఈ నెల 28వ, తేదిన వెలువడనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది ఉత్కంఠను రేకెత్తిస్తోంది.ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకుగాను టిడిపి, వైసీపీలు తీవ్రంగా కృషి చేశాయి.

నంద్యాలలో 8 మంది మంత్రులు మకాం వేసి టిడిపి తరపున ప్రచారం నిర్వహించారు. మరోవైపు వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ 13 రోజులపాటు నంద్యాలలోనే మకాం వేసి ప్రచారం నిర్వహించారు.

ఈ తరుణంలో ఈ ఎన్నికపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సాధారణ ఎన్నికల కంటే ఉపఎన్నికల్లో కూడ అత్యధికంగా పోలింగ్ శాతం నమోదు కావడం కూడ ఆసక్తిని కల్గిస్తోంది. దీంతో బెట్టింగ్ రాయుళ్ళు కూడ ఈ ఎన్నికపై ఉత్సాహంగా బెట్టింగ్‌లో పాల్గొంటున్నారు.

నంద్యాల ఫలితంపై బెట్టింగ్

నంద్యాల ఫలితంపై బెట్టింగ్

నంద్యాల ఉపఎన్నిక ముగిసింది. ఇక ఫలితం తేలాల్సి ఉంది. కౌంటింగ్‌కు ఇంకా నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది. అయితే ఈ నాలుగు రోజుల్లోనే ఫలితంపై కోట్లలో బెట్టింగ్‌లు సాగుతున్నట్టు సమాచారం.ప్రచారం చివరి రోజు వరకు కొంచెం అటూ ఇటుగా ఫలితం ఎవరికి అనుకూలంగా వస్తుందో అని పందాలు కాసినా తర్వాత పరిస్థితి మాత్రం ఒక్కసారిగా మారిపోయింది. పూర్తిగా మెజారిటీ మీదే ఇప్పుడు పందాలు నడుస్తున్నాయని చెబుతున్నారు. టీడీపీ అభ్యర్థి మెజార్టీపై ప్రస్తుతం పందాలు ఎక్కువగా నడుస్తున్నట్లు అంచనా వేస్తున్నారు.

Recommended Video

    Nandyal By Polls : Bonda Uma ready to shave his head if TDP lost | Oneindia Telugu
    రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బెట్టింగ్‌లు

    రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బెట్టింగ్‌లు

    నంద్యాల ఫలితంపై రాయలసీమలోని నాలుగు జిల్లాలతో పాటు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, విశాఖ జిల్లాల్లో భారీ ఎత్తున బెట్టింగ్ జరుగుతోంది. ఇక కర్నూలు జిల్లాల్లో బంధుత్వాలు ఉన్న తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాతో పాటు హైదరాబాద్, కర్నాటకలోని తెలుగువారు ఎక్కువగా ఉండే బళ్లారి, రాయచూర్, కోలార్, బెంగళూరు ప్రాంతాల్లో కూడా ఈ ఉపఎన్నికపై పందాలు కాస్తున్నారు. మొత్తంగా ఇప్పటికి రూ.వెయ్య కోట్లకుపైగా పందాలు జరిగినట్లు ఓ అంచనా. టీడీపీ అభ్యర్థిపై బెట్టింగ్ పెడితే రూపాయికి రూపాయి, అదే వైసీపీ అభ్యర్థిపై పెడితే రూపాయికి మూడు రూపాయలు ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారని సమాచారం.

    నంద్యాలపై బెట్టింగ్‌లు కాకినాడలో అరెస్ట్

    నంద్యాలపై బెట్టింగ్‌లు కాకినాడలో అరెస్ట్

    మూడు రోజుల క్రితం కాకినాడలో పోలీసులు అరెస్ట్ చేసిన బెట్టింగ్ ముఠా నంద్యాల ఫలితంపై ఇప్పటికే రూ.50 కోట్లు బెట్టింగ్‌లు సేకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.నంద్యాల పోలింగ్‌కు, కౌంటింగ్‌కు మధ్య ఇంకా నాలుగు రోజుల గడువు ఉంది. ఇన్ని రోజుల గడువు ఉండటంతో సహజంగానే ఫలితం మెజార్టీపై చర్చ జరుగుతుంది. ఈ పరిస్థితి బెట్టింగ్‌లు పెరగడానికి కారణమవుతాయని అంచనా వేస్తున్నారు. పోలైన ఓట్లు విశ్లేషణలతో ఇప్పటికే ఓ అంచనాకు వచ్చినవారు బెట్టింగ్‌లకు రెడీ అవుతున్నారని తెలుస్తోంది.

    బెట్టింగ్‌లతో బజారున పడుతున్న కుటుంబాలు

    బెట్టింగ్‌లతో బజారున పడుతున్న కుటుంబాలు

    నంద్యాల ఎన్నికల్లో టిడిపి, వైసీపీ అభ్యర్థుల్లో ఎవరో ఒకరు విజయం సాధిస్తారు. కానీ, బెట్టింగ్‌లకు పాల్పడుతున్న వారు తమ కుటుంబాలను బజారునపడేస్తున్నారు.
    నంద్యాల ఫలితం,మెజార్టీలపై బెట్టింగ్‌లు దాదాపు రూ.2వేల కోట్లకు చేరవచ్చని అంచనాలు వస్తున్నాయి.నంద్యాల ఎన్నిక రాజకీయ నేతల మధ్య సవాళ్లు , ప్రతి సవాళ్లకు నిలయంగా మారడంతో ద్వితీయశ్రేణి నేతలు కూడా తమ స్థాయిలో బెట్టింగ్‌లకు సిద్ధపడుతున్నారు. తమ పోటీ నేతలతో పందాలకు సై అంటున్నారు. క్రికెట్ మ్యాచ్‌ల సమయంలో బెట్టింగ్ రాకెట్‌లు నడిపే ముఠాలు కూడా ప్రస్తుతం పందాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+