విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కొనసాగుతున్న భారత్ బంద్ .. విజయవాడ బస్ స్టాండ్ వద్ద ఆందోళనలు, అరెస్ట్ లతో ఉద్రిక్తత

|
Google Oneindia TeluguNews

నేడు దేశ వ్యాప్తంగా భారత్ బంద్ కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ 10 ప్రధాన కార్మిక సంఘాలు నేడు భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెల్లవారుజామునుంచే పలు చోట్ల బంద్ ప్రారంభమైంది. ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ, పెట్టుబడుల ఉపసంహరణతో పాటు ప్రజా వ్యతిరేక విధానాలపై వ్యతిరేకంగా ఈ సమ్మె జరగనుంది. దేశవ్యాప్తంగా జరగనున్న ఈ బంద్‌లో దాదాపు 25 కోట్ల మంది పాల్గొంటారని కార్మిక సంఘాలు అంచనా వేస్తున్నాయి.

విజయవాడ బస్ స్టాండ్ వద్ద వామపక్ష పార్టీల నిరసన ... ట్రాఫిక్ జామ్

విజయవాడ బస్ స్టాండ్ వద్ద వామపక్ష పార్టీల నిరసన ... ట్రాఫిక్ జామ్

ఇప్పటికే దేశ వ్యాప్తంగా రోడ్లపైకి వచ్చిన ఆందోళనకారులు సమ్మెలో పాల్గొంటున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా బంద్ కొనసాగుతుంది. వామ పక్ష పార్టీలు, పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల అధ్వర్యంలో విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ ముందు ఆందోళన కారులు నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ, ఎన్నార్సీ, సిఏఏ ,అలాగే కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని కేంద్రంలోని బీజేపీకి కాలం చెల్లిందాని ఆందోళన కారులు నిరసన తెలియజేస్తున్నారు. దీంతో అక్కడ ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

కొనసాగుతున్న పోలీసుల అరెస్ట్ లు.. ఉద్రిక్తత

కొనసాగుతున్న పోలీసుల అరెస్ట్ లు.. ఉద్రిక్తత

పోలీసులు ఆందోళన కారులను బంద్ కొనసాగించకుండా అరెస్ట్ లు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానాలకు దేశ వ్యాప్తంగా ప్రజలు సమాధానం చెప్తారని ఆందోళనకారులు అంటున్నారు. ఆందోళనకారుల నిరసనలతో, పోలీసుల అరెస్ట్ లతో విజయవాడ బస్ స్టాండ్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రజల నుండి కూడా ఈ బంద్ కు పూర్తి మద్దతు లభిస్తుంది. ఎక్కడికక్కడ బంద్ కొనసాగుతుంది. దుకాణాలు, విద్యాసంస్థలు మూతపడ్డాయి.

 భారత్ బంద్ కు మద్దతిస్తున్న బ్యాంకర్స్ .. బ్యాంకుల బంద్

భారత్ బంద్ కు మద్దతిస్తున్న బ్యాంకర్స్ .. బ్యాంకుల బంద్


కాగా ఈ బంద్‌కు మద్దతుగా తాము విధులు బహిష్కరిస్తున్నట్లు ఆలిండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోషియేషన్, ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్, ఇండియా నేషనల్ బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్, బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తదితర యూనియన్లు ప్రకటించాయి. దీంతో నేడు బ్యాంకుల బంద్ కొనసాగుతుంది.బ్యాంకింగ్, రవాణా రంగంపై బంద్ ఎఫెక్ట్ పడనుంది. మరోవైపు ఈ బంద్‌కు పలు రాజకీయ పార్టీల నుంచి కూడా మద్దతు లభించింది.

English summary
Bharat Bandh will also continue in Andhra Pradesh. Protesters marched in front of the Pandit Nehru bus station in Vijayawada under the aegis of left parties, various political parties and public associations. Concerned activists are protesting that the central government is pursuing policies of privatization of public institutions, the NRC and CAA as well as anti-labor policies. This caused a severe disruption to traffic.police arrested the protesters cause tension near bus station.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X