Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇంద్రకీలాద్రిపై భవానీల ఇరుముడి వివాదం..! అపచారమన్న వైసీపీ-సర్కార్ క్లారిటీ..!

విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న భవానీ దీక్షల ముగింపు కార్యక్రమంలో తాజాగా ఓ వివాదం చోటు చేసుకుంది. భవానీ ఇరుముడి బంధాలను దుర్గ గుడి ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈఓ శీనానాయక్ విప్పడం వివాదానికి కారణమైంది. తొలి రోజు ఫొటో కోసం ఈఓ, ఛైర్మన్ అత్యుత్సాహం చూపినట్లు ఆరోపణలు వచ్చాయి. భవానీల ఇరుముడి బంధాలను గురు భవానీలు తప్ప సాధారణ వ్యక్తులు తాకరాదనే నిబంధన ఉన్నా.. ఈఓ, ఛైర్మన్ ఇరుముడి బంధాలను విప్పి ఫొటోలకు ఫోజులివ్వడంపై గురు భవానీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కచ్చితంగా అపచారమని వైసీపీ ఆరోపించింది. దీనిపై సర్కార్ క్లారిటీ ఇచ్చింది.

బాధ్య‌త గ‌ల ప‌ద‌వుల్లో ఉన్న బెజవాడ కనకదుర్గమ్మ ఆల‌య ఈవో, చైర్మ‌న్ లు భక్తుల మ‌నోభావాల‌ను గౌర‌వించాల్సిందిపోయి 40 రోజులపాటు భ‌వానీ దీక్ష చేసి విర‌మ‌ణ కోసం ఇరుముడితో వ‌చ్చిన భ‌క్తుల‌ను అవ‌మానించారని వైసీపీ మాజీ మంత్రి వెలంప‌ల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో సుదూర ప్రాంతాల నుంచి వ‌చ్చిన భ‌క్తుల ఇరుమ‌డిని శాస్త్రోక్తంగా ఆల‌య అర్చ‌కులు, లేదా గురుస్వాములు విప్పాల్సి ఉంటే అందుకు విరుద్దంగా ఆల‌య ఈవో, చైర్మ‌న్‌లు చేతులు పెట్టి భ‌క్తుల‌ను ఇబ్బంది పెడుతున్నార‌ని ఆరోపించారు.

Bhavani Bundle Controversy at Indrakeeladri YSRCP Alleges Mischief Government clarified

దీనిపై ప్రభుత్వం వివరణ ఇచ్చింది. అమ్మవారి భక్తుల మనోభావాలు కించపరిచే విధంగా కొంతమంది ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపించింది. చైర్మన్, ఈవో మరియు ట్రస్టీలు మొదటి రోజు చేసిన కృషిని దెబ్బతీసేలా కొన్ని వార్తాపత్రికలు మరియు సోషల్ మీడియాలో ప్రతికూల ప్రచారం జరిగిందని, వారు ఉద్దేశపూర్వకంగా "ఇరుముడిని గురు భవానీ సమర్పించకముందే అధికారులే తెరిచారనే తప్పుడు వార్తలను సృష్టించి, భక్తుల మనోభావాలను దెబ్బతీయాలని చూశారని తెలిపింది.

Bhavani Bundle Controversy at Indrakeeladri YSRCP Alleges Mischief Government clarified

అగ్ని ప్రతిష్టాపన అనంతరం, చైర్మన్, ఈవో, ట్రస్ట్ బోర్డు సభ్యులు ఇరుముడులు సమర్పించే ప్రదేశానికి వెళ్లారని, అక్కడ భక్తుల నుండి వచ్చిన ఒక ఇరుముడిని (గణేష్ గురు భవానీ సమర్పించినది) అధికారికంగా ప్రారంభించి, ప్రెస్ వారికి కేవలం ఫోటో స్టిల్ ఇచ్చారని క్లారిటీ ఇచ్చింది. ఇది ఆనవాయితీలో భాగంగా, అధికారిక ప్రారంభానికి గుర్తుగా మాత్రమే జరిగిందని వెల్లడించింది. నిజానికి, గురు భవానీ సమర్పించిన ఇరుముడిని అధికారికంగా స్వీకరించి, ప్రారంభ ఘట్టాన్ని తెలియజేయడానికి మాత్రమే ఫోటో స్టిల్ ఇచ్చారని, ఆలయ అధికారులు మరియు పాలక మండలి సభ్యులు భవానీ దీక్షల పట్ల అత్యంత భక్తి శ్రద్ధలతో వ్యవహరిస్తున్నారని, ఎలాంటి అనాలోచిత చర్యలకు పాల్పడలేదని వివరణ ఇచ్చింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+