త్వరలోనే ఆధారాలతో మీడియా ముందుకు వస్తా: భూమా అఖిలప్రియ

బెయిల్ పై విడుదలైన తర్వాత మాజీ మంత్రి భూమా అఖిలప్రియ నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. ఏవీ సుబ్బారెడ్డిపై జరిగిన దాడి విషయంలో ఆమెకు కండిషన్ బెయిల్ లభించిన సంగతి తెలిసిందే. తాలూకా పోలీస్ స్టేషన్ కు వచ్చి సంతకం చేసి వెళ్లారు. అఖిలప్రియ స్టేషన్ కు రావడంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతోపాటు భూమా అభిమానులు భారీసంఖ్యలో చేరుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.

 bhuma akhilapriya

ప్రపంచంలోకానీ, దేశంలోకానీ ఎక్కడా జరగన వింత సంఘటన నంద్యాలలో జరిగిందన్నారు. మహిళ మీద దాడి చేసి.. మళ్లీ అదే మహిళ మీద కేసు పెట్టి స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారన్నారు. ఇలాంటి సంస్కృతి తాను ఎక్కడా చూడలేని, అలాగే వినలేదన్నారు. దీన్నిబట్టి రాష్ట్రంలో ఉన్న మహిళల పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థమవుతుందన్నారు. తన మీద కేసు నమోదు చేయించడమే కాకుండా.. కేసు నమోదుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినవారి ఇంట్లో ఉండే మహిళలు కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నానన్నారు. ఈ దాడికి సంబంధించిన పూర్తి ఆధారాలతో త్వరలోనే తాను మీడియా ముందుకు వస్తానన్నారు.

 bhuma akhilapriya

ఈ నెల 16న నారా లోకేష్ యువగళం పాదయాత్రనంద్యాల నియోజకవర్గానికి చేరుకుంది. కొత్తపల్లి దగ్గర లోకేష్‌కు స్వాగతం పలికేందుకు భూమా అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి వర్గీయుల మధ్య వాగ్వాదం నడిచింది.. అఖిలప్రియ వర్గీయుడు ఏవీ సుబ్బారెడ్డిపై దాడి చేశాడు. వెంటనే పోలీసులు ఏవీ సుబ్బారెడ్డిని అక్కడినుంచి కారులో పంపించేశారు. ఈ దాడి ఘటనపై ఏవీ సుబ్బారెడ్డి నంద్యాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. అఖిలప్రియతోపాటు పలువురిపై పోలీసులు కేసు నమోదు చేసి నంద్యాల తరలించారు. కోర్టు రిమాండ్ విధించడంతో ఆమెను జైలుకు పంపించారు. కర్నూలు కోర్టులో షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+