కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇలా ఉండాలి..!: భూమాతో లోకేష్, కర్నూలు రాజకీయాలపై చర్చ

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఇటీవలే తెలుగుదేశం పార్టీలో చేరిన కర్నూలు జిల్లా సీనియర్ రాజకీయ నాయకుడు, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి హైదరాబాదులో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను కలిశారు. ఆయన అనుచరులతో వచ్చి లోకేష్‌తో భేటీ అయ్యారు.

లోకేష్‌తో ఆయన వివిధ అంశాల పైన చర్చించినట్లుగా తెలుస్తోంది. కర్నూలు రాజకీయాల పైన వారు ప్రధానంగా చర్చించారు. భూమా ఇటీవలే పార్టీలోకి వచ్చినందున పార్టీలో ఉన్న పాతవారితో సంబంధాలు మెరుగుపర్చుకోవడానికి అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారని తెలుస్తోంది.

Bhuma Nagi Reddy meets Nara Lokesh

భూమాతో పాటు నంద్యాల, ఆళ్లగడ్డ ప్రాంతాలకు చెందిన ఆయన అనుచరులు కూడా లోకేశ్ ను కలిశారు. భూమా చేరికను వ్యతిరేకిస్తున్న టిడిపి నేతలు ఫ్యాక్షన్ రాజకీయాలు తిరిగి మొదలవుతాయని ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భూమా.. లోకేష్‌ను కలవడం, ఆయన సూచనలు చేసినట్లుగా తెలుస్తోంది.

అమరావతిలో రహదారి టెండర్లకు అడుగు

అమరావతిలో రహదారి టెండర్లకు అడుగు పడింది. ఈ రహదారిని కనకదుర్గమ్మ వారధి నుంచి బోరుపాలెం వరకు వేయాల్సి ఉంది. మొత్తం 18.3 కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ తొలి భాగానికి రూ.240 కోట్ల అంచనాలతో టెండర్లు పిలిచారు. బిడ్ల దాఖలుకు పదిహేను రోజుల గడువు, 9 నెలల్లో నిర్మించాలని పేర్కొన్నారు.

English summary
MLA Bhuma Nagi Reddy meets TDP leader Nara Lokesh in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X