రేపటి బడ్జెట్ వాయిదా: భూమా నాగిరెడ్డి కళ్లు దానం చేసిన ఫ్యామిలీ
నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతి నేపథ్యంలో సోమవారం నాడు ప్రవేశ పెట్టనున్న ఏపీ బడ్జెట్ వాయిదా పడింది. భూమా మృతికి సంతాపంగా రేపు శాసన సభ, శాసన మండలిలకు సెలవు ప్రకటించారు.
విజయవాడ: నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతి నేపథ్యంలో సోమవారం నాడు ప్రవేశ పెట్టనున్న ఏపీ బడ్జెట్ వాయిదా పడింది. భూమా మృతికి సంతాపంగా రేపు శాసన సభ, శాసన మండలిలకు సెలవు ప్రకటించారు.
షెడ్యూల్ ప్రకారం రేపు ఏపీ బడ్జెట్ ప్రవేశ పెట్టవలసి ఉంది. అయితే, భూమా హఠాత్మరణం నేపథ్యంలో బడ్జెట్ వాయిదా పడింది. బడ్జెట్‌ను ఎల్లుండి ప్రవేశ పెట్టనున్నారని తెలుస్తోంది. లేదా రేపు బీఏసీలో తేదీ నిర్ణయించనున్నారు.

కాగా, భూమా మృతికి స్పీకర్ కోడెల శివప్రసాద రావు, సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్, మంత్రులు, తదితరులు సంతాపం తెలిపారు.
నేత్రదానం
భూమా నాగిరెడ్డి కళ్లను ఆయన కుటుంబ సభ్యులు దానం చేశారు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బయలుదేరారు. భూమా మృతదేహాన్ని మూడు గంటలకు ఆళ్లగడ్డ తరలించనున్నారు.












Click it and Unblock the Notifications