శోభా నాగిరెడ్డి మృతి తర్వాత ఇలా.. మానసిక ఒత్తిడిలో భూమా నాగి రెడ్డి?

దివంగత నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మానసిక ఒత్తిడితో గడిపారా? అంటే కావొచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి. మూడేళ్ల క్రితం సతీమణి శోభా నాగిరెడ్డి మృతి నుంచి తాజా రాజకీయ పరిణామాల వరకు చూస్తుంటే ఆయన మా

ఆళ్లగడ్డ: దివంగత నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మానసిక ఒత్తిడితో గడిపారా? అంటే కావొచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి. మూడేళ్ల క్రితం సతీమణి శోభా నాగిరెడ్డి మృతి నుంచి తాజా రాజకీయ పరిణామాల వరకు చూస్తుంటే ఆయన మానసిక వేధనకు లోనైనట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.

శోభ లేకుంటే..

శోభ లేకుంటే..

2014లో సార్వత్రిక ఎన్నికల సమయంలో శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదం కారణంగా కన్ననుమూశారు. ఆ తర్వాత ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. శోభ లేకుంటే తాను అంగవైకల్యంతో బాధపడుతున్న వ్యక్తితో సమానమని చెప్పారు.

మానసిక ఒత్తిడి

మానసిక ఒత్తిడి

భార్య మృతి తర్వాత ఆయన కుటుంబపరంగా, రాజకీయపరంగా మానసిక ఒత్తిడి ఎదుర్కొన్నారని అంటున్నారు. అప్పటికే ఆయనకు రెండుసార్లు గుండెపోటు వచ్చింది. బైపాస్ సర్జరీ జరిగింది. మరోవైపు కుమార్తె పెళ్లి అంశం కూడా ఆయనను ఒత్తిడికి గురి చేసిందని అంటున్నారు.

కేసులు

కేసులు

రాజకీయాల విషయానికి వస్తే.. శోభా నాగిరెడ్డి మృతి అనంతరం ఆయన కేసులు ఎదుర్కొన్నారు. ఆయన టిడిపిలో చేరడానికి కేసులు కూడా ఓ కారణంగా భావిస్తున్నారు.

ఒత్తిడి

ఒత్తిడి

ఒత్తిడి వల్లే ఆయన సైకిల్ ఎక్కారని, అలాగే, తాజా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన ప్రత్యర్థిని గెలిపించడం కోసం అయిష్టపూర్వకంగానే పని చేసేందుకు అంగీకరించారనే వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తానికి శోభ మృతి తర్వాత భూమా లైఫ్ ఒత్తిడితో గడిచిపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా భూమా మృతి ఇటు టిడిపికి, అటు కర్నూలుకు పెద్ద లోటు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+