బిగ్ అలర్ట్: ఏపీలో షిర్డీ, సికింద్రాబాద్, విశాఖ వెళ్లే రైళ్లన్నీ రద్దు

దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విజయవాడ-కాజీపేట సెక్షన్ లో మోటుమర్రి దగ్గర నాన్ ఇంటర్ లాకింగ్ పనులు అధికారులు చేపట్టారు. సిగ్నలింగ్ వ్యవస్థను బలోపేతం చేయడానికి జరుగుతున్న ఈ పనులవల్ల కొన్ని ప్రధానమైన రైళ్లను రద్దుచేయడంతోపాటు మరికొన్ని రైళ్లను దారి మళ్లించి నడుపుతున్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి అందుకు తగినట్లుగా తమ ప్రయాణానికి ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

రద్దయిన రైళ్లు

గుంటూరు-సికింద్రాబాద్ (12705) ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్
సికింద్రాద్-గుంటూరు (12706) ఇంటర్‌‌సిటీ ఎక్స్‌ప్రెస్‌
రద్దయిన తేదీలు: ఈనెల 28, 29, జనవరి 2,5,7,8,9

big alert for ap people important trains cancelled and route divertion due to non inter locking works

కాచిగూడ - మిర్యాలగూడ (07276),
మిర్యాలగూడ - నడికుడి (07277)
రద్దయిన తేదీలు: ఈనెల 26 నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు

నడికుడి - మిర్యాలగూడ (07973),
మిర్యాలగూడ - కాచిగూడ (07974)
రద్దయిన తేదీలు: ఈనెల 27వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ వరకు

గుంటూరు - సికింద్రాబాద్‌ - గుంటూరు గోల్కొండ్‌ ఎక్స్‌ప్రెస్‌ (17201/17202)
రద్దయిన తేదీలు: ఈనెల 27వ తేదీ నుంచి జనవరి 9వ తేదీ వరకు గుంటూరు నుంచి కాజీపేట వరకే నడుస్తుంది. తిరిగి కాజీపేట నుంచి గుంటూరు వెళుతుంది.

దారి మళ్లించిన రైళ్లు (విజయవాడ నుంచి గుంటూరు మీదుగా సికింద్రాబాద్, వికారాబాద్)

విశాఖపట్నం-ముంబై ఎల్‌టీటీ (18519) ఈ నెల 26 నుంచి జనవరి 8 వరకు
షాలిమార్‌ - హైదరాబాద్‌ (18045) జనవరి 6 నుంచి 8వ తేదీ వరకు
హైదరాబాద్ -‌ షాలిమార్‌ (18046) జనవరి 7 నుంచి 9వ తేదీ వరకు
సాయినగర్‌ షిర్డీ - కాకినాడ పోర్టు (17205) జనవరి 7న
కాకినాడ పోర్టు - సాయినగర్‌ షిర్డీ (17206) జనవరి 8న
సాయినగర్‌ షిర్డీ - మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ (17207) జనవరి 8న
మచిలీపట్నం - సాయినగర్‌ షిర్డీ ఎక్స్‌ప్రెస్ (17208) జనవరి 7న

ముంబై సీఎస్‌ఎంటీ - భువనేశ్వర్‌ ఎక్స్‌ప్రెస్ (11019)
భువనేశ్వర్‌ - ముంబై సీఎస్‌ఎంటీ ఎక్స్‌ప్రెస్‌ (11020) జనవరి 6 నుంచి 8వ తేదీ వరకు
వాడి - వికారాబాద్‌ - సికింద్రాబాద్‌ - పగిడిపల్లి - గుంటూరు - విజయవాడ మీదుగా దారి మళ్లిస్తారు.

షాలిమార్‌ - సికింద్రాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ (22849) జనవరి 1, 8 తేదీల్లో
విశాఖపట్టణం - సికింద్రాబాద్‌ (20833) రైళ్లను విజయవాడ - గుంటూరు - సికింద్రాబాద్‌ మార్గంలో నడుపుతారు.
సికింద్రాబాద్‌ - షాలిమార్‌ ఎక్స్‌ప్రెస్ (12774) 7వ తేదీన గుంటూరు, సికింద్రాబాద్ మీదుగా నడుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+