'బిగ్' షాకింగ్: జూ.ఎన్టీఆర్ షో మొదలు, మహేష్ కత్తిపై కొత్త డౌట్స్

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి/హైదరాబాద్: నిత్యం జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ మీడియాలో నానుతున్న మహేష్ కత్తికి నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఆయన ఆదివారం సోమాజిగూడలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్, పూనమ్ కౌర్, జనసేనాని అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

పవన్ కల్యాణ్‌పై పోటీ చేస్తా : నడిరోడ్డు మీద కాల్చి చంపినా తప్పులేదు పై మహేష్ కత్తి !

పూనమ్‌ను లాగి మరో తప్పు!: మహేష్ కత్తికి యాంకర్ దిమ్మతిరిగే షాక్, మీరెవరికి తెలుసు?

ఈ సందర్భంగా మహేష్ కత్తి నటి పూనమ్ కౌర్‌కు వ్యక్తిగతంగా ప్రశ్నలు సంధించి దారుణంగా వ్యవహరించారనే విమర్శలు వస్తున్నాయి. ఓ యువతి పట్ల ఎలా వ్యవహరించారో కూడా తెలియదా అని చాలామంది మండిపడ్డారు. ఇదిలా ఉండగా పూనమ్‌కు ఆరు ప్రశ్నలతో పాటు పవన్‌కు మహేష్ కత్తి ప్రశ్నలు వేశారు. ఈ నేపథ్యంలో నెటిజన్లు స్పందిస్తున్నారు.

రెచ్చిపోతున్న మహేష్ కత్తి‌: వెనుక బలమైన శక్తి, పవన్ కళ్యాణ్‌పై ప్లాన్‌తో రంగంలోకి?

 మహేష్ కత్తి-వైయస్సార్ కాంగ్రెస్

మహేష్ కత్తి-వైయస్సార్ కాంగ్రెస్

మహేష్ కత్తి వెనుక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉందనే ప్రచారం సాగుతోన్న విషయం తెలిసిందే. ఇదే ప్రశ్నను పలువురు నెటిజన్లు వేస్తున్నారు. పూనమ్ కౌర్‌కు ఆరు ప్రశ్నలు వేస్తే నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇందులో ఏడు ప్రశ్నలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా, పూనమ్‌మను ప్రశ్నించడంలో తప్పు లేదని, కానీ ఆమె వ్యక్తిగత విషయాలను తవ్వడం మహేష్ కత్తి చేసిన దారుణమైన పొరపాటు అంటున్నారు.

 ఏ పార్టీతో సంబంధం లేదని చెబుతున్నప్పటికీ

ఏ పార్టీతో సంబంధం లేదని చెబుతున్నప్పటికీ

తనకు ఏ పార్టీతోను సంబంధం లేదని, తన వెనుక ఏ పార్టీ లేదని మహేష్ కత్తి పదేపదే చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పలువురు వైసీపీ వైపు వేలు చూపిస్తున్నారు. నీ వెనుక వైసీపీ ఉందని అనుమానాలు కలుగుతున్నాయని అంటున్నారు. హైపర్ ఆది కూడా ఈ అంశాలను లేవనెత్తారు.

జూ.ఎన్టీఆర్ షోలో అంబటి రాంబాబు రికమెండ్, షాకింగ్

జూ.ఎన్టీఆర్ షోలో అంబటి రాంబాబు రికమెండ్, షాకింగ్

హైపర్ ఆది.. మహేష్ కత్తికి ఏడు ప్రశ్నలు సంధించారు. అందులో వైసీపీని, ఆ పార్టీ నేత అంబటి రాంబాబును లాగారు. బిగ్ బాస్ షోలో ఎంట్రీకి అంబటి రాంబాబు ఎందుకు రికమెండ్ చేశారో చెప్పాలని హైపర్ ఆది ఆసక్తికర ప్రశ్న సందించారు. జూ ఎన్టీఆర్ బిగ్ బాస్ ద్వారా మహేష్ కత్తి కొందరికి తెలిశాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌పై విమర్శలు, తిట్ల ద్వారా అందరి నోళ్లలో నానుతున్న విషయం తెలిసిందే.

మహేష్ కత్తిపై కొత్త అనుమానాలు

మహేష్ కత్తిపై కొత్త అనుమానాలు

పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేసేందుకు వైసీపీ ఎంత ఇచ్చిందని కూడా ప్రశ్నించారు. ఆ ప్రశ్నలను బట్టి చూస్తుంటే ముందస్తు ప్లాన్‌గానే పవన్ కళ్యాణ్ పైన వైసిపి ఆయుధం వదిలిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. 2019లో పవన్ తమకు పోటీగా వస్తారని భావించే ఇప్పుడు ఆయనను తెరపైకి తెచ్చి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బిగ్ బాస్ షోకు అంబటి రాంబాబు రికమెండ్ చేయడం మొదలు.. ఆయన తీరు వైసీపీకి అనుకూలంగా ఉందని చెబుతున్నారు. 2019 ఎన్నికలకు ముందు ప్లాన్ ప్రకారమే పవన్ పైన దాడి జరుగుతోందని అంటున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకలల జీవిత భాగస్వామిని కనుగొనండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Many people are thinking that YSR Congress party behind Mahesh Kathi. Now, Hyper Aadhi revealed shocking about Mahesh Kathi.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి