90 రోజుల్లో పెను మార్పు, జగన్‌కు పెద్ద షాక్: వర్ల

హైదరాబాద్: మరో మూడు నెలల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి భారీ షాక్ తగలనుందని తెలుగుదేశం పార్టీ నేత వర్ల రామయ్య గురువారం జోస్యం చెప్పారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

జగన్‌కు తగలనున్న భారీ షాక్‌తో ఆయన ఆర్థిక భాగస్వాముల్లోను ప్రకంపనలు తప్పవని హెచ్చరించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో పెను ప్రకంపనలు వచ్చే రోజున జగన్ మొరను ఆలకించే నాథుడు ఉండడన్నారు. అక్రమాస్తుల్లో నిందితుడైన జగన్‌కు ప్రజల్లో తిరిగే హక్కు లేదన్నారు. 90 రోజుల్లో జరిగే పెను పరిణామాలు ఏమిటో చెప్పలేమన్నారు.

Big change in three months, says Varla Ramaiah

అన్ని ఏర్పాట్లు చేశాం: గంటా

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఎంసెట్‌ పరీక్ష సందర్భంగా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రి గంటా శ్రీనివాస రావు గురువారం చెప్పారు. ఏపీ ఎంసెట్‌ ఇంజనీరింగ్‌కు పేపరు సెట్‌ కోడ్‌ ఎన్‌ 1ను ఎంపిక చేశారు. ఎంసెట్‌కు కొత్త ఆలస్యమైనా అనుమతిస్తామన్నారు. విద్యార్థుల కోసం ప్రైవేటు బస్సులను అందుబాటులో ఉంచామన్నారు.

మల్లి మస్తాన్ బాబు కుటుంబానికి 10 లక్షల సాయం

అంతర్జాతీయ పర్వతారోహకుడు మల్లి మస్తాన్ బాబు ప్రతిభాపాటవాలు అద్భుతమని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ప్రశంసించారు. ఆ మహానీయుడి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియో అందిస్తున్నట్లు వెల్లడించారు.

గురువారం నెల్లూరు జిల్లా సంగం మండలం గాంధీజనసంఘం వద్ద మల్లి మస్తాన్ సమాధి ప్రాంగణంలో నిర్వహించన ఉత్తరక్రియలకు మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సంగంలోని గురుకుల బాలికల ఉన్నత పాఠశాలకు మల్లి మస్తాన్ బాబు పేరు పెడుతున్నట్లు తెలిపారు. అలాగే గాంధీజనసంఘంలో మస్తాన్ పేరిట ఓ కమ్యూనిటీ హాలు నిర్మిస్తామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+