వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుడివాడలో బిగ్ టర్నింగ్ -ఏకమైన కొడాలి ప్రత్యర్ధులు-చంద్రబాబు ప్లాన్ సక్సెస్ !

|
Google Oneindia TeluguNews

ఏపీలో గుడివాడ రాజకీయం ఎప్పుడూ ఆసక్తి రేపుతూనే ఉంటుంది. వరుసగా నాలుగుసార్లు ఇక్కడి నుంచి గెలిచి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కొడాలి నానిని ఎలాగైనా ఓడించేందుకు టీడీపీ మరో ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా ఈసారి ఆయనకు సమఉజ్జీల్ని వెతుకున్న చంద్రబాబుకు వెనిగండ్ల రాము రూపంలో ఓ ఎన్నారై దొరికారు. అయితే స్ధానికంగా ఇన్ ఛార్జ్ గా పార్టీ సీనియర్ నేత రావి వెంకటేశ్వరావుతో ఈయనకు పొసగలేదు. దీంతో ఈ రెండు వర్గాల పోరుతో మరోసారి కొడాలి గెలుపు ఖాయమని భావిస్తున్న తరుణంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది.

 గుడివాడ టీడీపీ పాలిటిక్స్

గుడివాడ టీడీపీ పాలిటిక్స్

గుడివాడలో వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఐదోసారి గెలుపుపై కన్నేసిన వైసీపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నానిని ఓడించేందుకు టీడీపీ కొంతకాలంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా కొడాలికి గట్టి పోటీ ఇచ్చే అభ్యర్ధుల కోసం అన్వేషిస్తోంది. 2019 ఎన్నికల్లో దేవినేని అవినాష్ ను బరిలోకి దింపి చేతులు కాల్చుకున్న టీడీపీ ఈసారి మాత్రం గట్టి అభ్యర్ధిని బరిలోకి దింపేందుకు ప్రయత్నిస్తోంది. ఈ తరుణంలో ఎన్నారై పారిశ్రామికవేత్త వెనిగండ్ల రాము ఎంట్రీ ఇచ్చారు. అయితే అప్పటికే అక్కడ రాజకీయాలు సాగిస్తున్న రావి వెంకటేశ్వరరావుతో ఈయనకు పోటీ ఏర్పడింది. దీంతో ఇప్పట్లో గుడివాడ పోరు తెగేలా లేదని అంతా భావించారు.

 రాము వర్సెస్ రావి

రాము వర్సెస్ రావి

గుడివాడలో కొడాలి నానిని ఓడించేందుకు వెనిగండ్ల రాము, రావి వెంకటేశ్వరరావులో ఎవరికి అవకాశం ఇవ్వాలన్న దానిపై టీడీపీ అధిష్టానం కొంతకాలంగా మల్లగుల్లాలు పడుతోంది. స్ధానికంగా క్యాడర్ తో సత్సంబంధాలు కలిగిన నేత రావి వెంకటేశ్వరరావుకు అవకాశం ఇవ్వాలా లేక ఆర్దికంగా బలవంతుడైన ఎన్నారై వెనిగండ్ల రాముకు అవకాశం ఇవ్వాలా అన్న విషయంలో చంద్రబాబు మల్లగుల్లాలు పడుతూ వచ్చారు. అయితే రాము భార్య ఎస్సీ సామాజిక వర్గం కావడంతో ఆమె సాయంతో ఇక్కడ భారీ సంఖ్యలో ఉన్న ఎస్సీ ఓట్లను కూడా కొల్లగొట్టవచ్చని టీడీపీ భావిస్తోంది. అలాగే రాము కూడా వచ్చీ రావడంతోనే గుడివాడలో చర్చిలు, పాస్టర్లకు సాయం చేయడం మొదలుపెట్టారు. దీంతో రాము అనూహ్యంగా పోటీలోకి దూసుకొచ్చారు. దీంతో రావి వర్గం కూడా అప్రమత్తమైంది.

 ఎట్టకేలకు చేతులు కలిపిన రాము-రావి

ఎట్టకేలకు చేతులు కలిపిన రాము-రావి

గుడివాడ టీడీపీ రాజకీయాల్లో వర్గపోరును గ్రహించిన టీడీపీ అధిష్ఠానం కీలక పావులు కదిపింది. దీంతో ఇవాళ గుడివాడలో తానా ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో టిడిపి మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వర రావు, ఎన్నారై వెనిగండ్ల రాము ఆత్మీయ కలయిక ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రావికు ఎన్నారై రాము జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఇరువురు నేతలు తమ విభేదాలు పక్కనబెట్టి ఆత్మీయంగా ముచ్చటించుకున్నారు. ఇరువురు నేతల కలయికను పట్టణ ప్రముఖులు కూడా ఆసక్తిగా తిలకించారు. దీంతో వీరిద్దరి మధ్య విభేదాలు పక్కనబెట్టి కలుసుకోవడం ఆసక్తికరంగా మారింది.

చంద్రబాబు ప్లాన్ సక్సెస్ ?

గుడివాడలో కొడాలి నానిని ఈసారి ఎలాగైనా ఓడించాలని పట్టుదలగా ఉన్న చంద్రబాబు.. ఇప్పటికే పలు వ్యూహాల్ని రచిస్తున్నారు. కానీ రావి-రాము వర్గాల మధ్య పోరుతో అవేవీ ఫలించడం లేదు. దీంతో వీరిద్దరి మధ్య పోరు ఇలాగే సాగితే వచ్చే ఎన్నికల్లోనూ గుడివాడలో రిక్త హస్తం తప్పదని గ్రహించిన బాబు.. ఇరువులు నేతలకు సంకేతాలు పంపారు. దీంతో ఇవాళ వీరిద్దరూ తానా ఫౌండేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమం వేదికగా కలిసిపోయారు. పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుని కలియదిరిగారు. వచ్చే ఎన్నికల్లో గుడివాడలో అభ్యర్ధిత్వాన్ని ఆశిస్తున్న రాముకు రావి మద్దతునిచ్చే అవకాశాలు కూడా దీంతో మెరుగుపడినట్లు తెలుస్తోంది. ఆ దిశగా చంద్రబాబు పంపిన సంకేతాలు ఫలించినట్లు తెలుస్తోంది.

English summary
in an interesting development in gudivada, leaders of two groups in tdp ravi venkateswarao and venigandla ramu have joined hands today against ysrcp mla kodali nani.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X